నేటి నుంచి రెండు రోజులపాటు జమ్ముకాశ్మీర్‌లో జీ 20 సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల కోసం పెద్ద ఎత్తున కమిటీ ఏర్పాట్లు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వివిధ తేదీల్లో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు.
G 20 Meetings in Jammu & Kashmir: నేటి నుంచి రెండు రోజులపాటు జమ్ముకాశ్మీర్‌లో జీ 20 సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల కోసం పెద్ద ఎత్తున కమిటీ ఏర్పాట్లు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వివిధ తేదీల్లో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీనగర్‌లో జరిగే సమావేశాల కోసం భద్రతను మరింత కట్టుదిట్టం జేసింది. 26/11 తరహా దాడులు జరిగే అవకాశం ఉందనే అనుమానాలు రేకెత్తడంతో భద్రతను మరింత పెంచారు. సైన్యం తకిఖీలు చేస్తున్న సమయంలో అనుమానం వచ్చిన ఉగ్రవాద అనుకూల వ్యక్తిని సైన్యం అదుపులోకి తీసుకుంది. విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
వినూత్న తరహాలు ముంబైలో సృష్టించిన విధంగా విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారనే సమాచారం తెలియడంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. కాశ్మీర్ లోయలు ఎలాంటి వదంతులు చెలరేగకుండా ఉండేందుకు సైన్యం జాగ్రత్తలు తీసుకుంది. మొబైల్ ఫోన్ నెట్ వర్క్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అంతర్జాతీయ సదస్సు కావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనువణువును నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అనుమానం వచ్చినా వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. చివరి నిమిషంలో ఉగ్రవాద కుట్రలు బయటపడటంతో సైన్యం మరింత అప్రమత్తం అయింది. రెండు రోజులపాటు జీ 20 సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ నాయకులు హాజరుకానున్నారు. జమ్ముతో పాటు కాశ్మీర్‌లోనూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉగ్రవాద కదలికలు ఎక్కువగా ఉండే గుల్మార్గ్ ప్రాంతంలో సైన్యం పహారా కాస్తున్నది. ఈ ప్రాంతంలో అడుగడుగునా అత్యాధునిక ఆయుధాలు ధరించిన సైన్యం మోహరించడంతో ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.