అదృష్టం ఎవరి తలుపు ఎలా తడుతుందో చెప్పడం చాలా కష్టం. తలుపుతట్టినపుడు తెరవాలి అంటారు. అయితే, ఓ వ్యవసాయ కూలి తలుపు తెరవకుండానే అదృష్టం తన ఇంట్లోకి అడుగులు పెట్టింది. ఆ అదృష్టం విలువ రూ. 100 కోట్లు.
Wage Worker: అదృష్టం ఎవరి తలుపు ఎలా తడుతుందో చెప్పడం చాలా కష్టం. తలుపుతట్టినపుడు తెరవాలి అంటారు. అయితే, ఓ వ్యవసాయ కూలి తలుపు తెరవకుండానే అదృష్టం తన ఇంట్లోకి అడుగులు పెట్టింది. ఆ అదృష్టం విలువ రూ. 100 కోట్లు. బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ. 17 మాత్రమే ఉండగా, అనుకోకుండా అతని అకౌంట్లోకి ఎలా వచ్చాయో తెలియదుగాని ఏకంగా రూ. 100 కోట్లు జమ అయ్యాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చందో పాపం అతనికి తెలియదు.
అకౌంట్లోకి వచ్చిన డబ్బును చూసి తేరుకొక ముందే అతనికి మరో షాక్ తగిలింది. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) నోటీసులు పంపారు. ఆ నోటీసులు చూసి పాపం ఆ కూలికి ఏం చేయాలో పాలుపోలేదు. డబ్బు ఎవరు వేశారో తెలియదు. ఎందుకు వేశారో తెలియదు. అకౌంట్లోకి డబ్బు వచ్చిన బాధితుడు ఇప్పుడు కేసులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని దేగంగా ప్రాంతంలోని వాసుదేవ్పూర్కు చెందిన మహ్మద్ నసీరుల్లా అనే వ్యవసాయ కూలీకి ఎస్బీఐలో అకౌంట్ ఉంది. ఈ అకౌంట్లో అతని ఖాతాలో రూ. 17 ఉంది. అనుకోకుండా ఎక్కడి నుంచి వచ్చాయో కాని అకౌంట్లో రూ. 100 కోట్లు జమైనట్లు మెసేజ్ రావడం చూసి షాకయ్యాడు. ఆ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి నోటీసులు రావడం చూసి లబోదిబోమంటున్నాడు నసీరుల్లా. తానో కూలి పనులు చేసుకునే వ్యక్తినని తన అకౌంట్లోకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదని వాపోయాడు. ఈనెల 30 లోగా పత్రాలు చూపాలని సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయని అన్నారు.