పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో జరిగిన అందోళనలను దృష్టిలో పెట్టుకొని నాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రగడ చేసింది. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడతారని హెచ్చరించింది. సామాన్యులకు మోడీ ప్రభుత్వం తీరని లోటు చేస్తోందని వాదించింది.
Rs 2000 Currency Withdrawn: పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో జరిగిన అందోళనలను దృష్టిలో పెట్టుకొని నాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రగడ చేసింది. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడతారని హెచ్చరించింది. సామాన్యులకు మోడీ ప్రభుత్వం తీరని లోటు చేస్తోందని వాదించింది. పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని మరోసారి స్పష్టం చేసింది. పెద్దనోట్లను రద్దు బడాబాబులపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయిందని విమర్శించింది. అదే సమయంలో రూ. 2 వేల నోట్లను అందుబాటులోకి తీసుకురావడంపై కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది.
ఎక్కువ మొత్తంలో డబ్బులు దాచుకునేందుకు ఈ పెద్దనోట్లు ఉపకరిస్తాయని హెచ్చరించింది. తాజాగా మరోమారు పెద్ద నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండువేల నోట్ల ఉపసంహరణ ముందుగా ఊహించిందేనని, ఈ నోట్ల రద్దుతో నోట్ల రద్దు సంపూర్ణమైందని, కానీ, ప్రభుత్వం దీని వలన సాధించింది శూన్యమని అన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో రెండోమారు విపత్తును తీసుకొచ్చిందని విమర్శలు చేశారు. మోడీ అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన మోడీ నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. 2016లో మోడీ చేసిన తప్పే మరలా 2023లోనూ చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. దేశంలోని బీజేపీయేతర పక్షాలు ఈ నిర్ణయంపై విమర్శలు చేస్తుండగా, గతంలో బీజేపీని వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. నోట్లు వెనక్కి తీసుకోవడంతో అవినీతిని తగ్గించవచ్చని పేర్కొన్నది.