మోడీ ప్రభుత్వం (Modi Government) దేశంలో అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ సభలను (Public Meetings) ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులో కేంద్ర హోంశాఖ మంత్రి (Amit Shah Tamilnadu Tour) నేతృత్వంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.
Amit Shah TamilNadu Tour: మోడీ ప్రభుత్వం (Modi Government) దేశంలో అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ సభలను (Public Meetings) ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులో కేంద్ర హోంశాఖ మంత్రి (Amit Shah Tamilnadu Tour) నేతృత్వంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. హోంశాఖ మంత్రి రెండు రోజులపాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు ముంబై నుంచి చెన్నైకు (Mumbai to Chennai) చేరుకుంటారు. అనంతరం ఐటీసీ గ్రాండ్ హోటల్లో మిత్రపక్షాలతో హోంశాఖ మంత్రి చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా తమిళనాడులో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే (AIADMK) నేతలతో ఆయన సమావేశం కానున్నారు.
అన్నాడీఏంకే నేత మాజీ ముఖ్యమంత్రి పళనీస్వామి (Palaniswami) తో ఆయన చర్చించనున్నారు. 2024 ఎన్నికలు లక్ష్యంగా ఆయన మాజీ ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉంది. పొత్తులు, సీట్లు తదితర విషయాలపై చర్చించనున్నారు. పళనీస్వామితో పాటు ఆయన మరో అన్నాడీఏంకే నేత ఓ పన్నీర్ సెల్వంతో (O Panneer Selvam) కూడా భేటీ అవుతారు. అయితే, ఈ భేటీ విడివిడిగా ఉంటుందా లేదంటే ఇద్దరితో కలిపి జరుగుతుందా అన్నది తెలియాలి. ఇద్దరు నేతలు కలిసి ఉంటేనే రాజకీయంగా ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉంటుందని, అన్నాడీఎంకే పటిష్టంగా ఉండాలంటే నేతలంగా ఐక్యంగా ఉండాలనే విధంగా వారికి బోధించే అవకాశం ఉంది. జూన్ 11న ఉదయం 11:40 గంటలకు వేళచ్చరిలో దక్షిణ చెన్నై బీజేపీ నేతలతో (BJP) ఆయన సమావేశం నిర్వహింస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 1:45 కి చెన్నై నుంచి వేలూరు వెళ్తారు. వేలూరులోని పల్లికొండలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభ ముగిసిన తరువాత సాయంత్రం 5:50 గంటలకు చెన్నై నుంచి విశాఖకు (Visakhapatnam) బయలుదేరి వెళ్తారు.