కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని కాకుండా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమయ్యేలా లోక్సభ సచివాలయానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రజావ్యాజ్యం దాఖలైంది.
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని కాకుండా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమయ్యేలా లోక్సభ సచివాలయానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రజావ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలియజేసింది. ఈరోజు ఈ అంశంపై విచారణ జరపనున్నది. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, ఇది ధర్మబద్దం కాదని, ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ ఒక దేవాలయం వంటిదని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలను ఆహ్వానించామని, కాని వారు రాజకీయం చేస్తూ ప్రారంభోత్సవానికి రాలేమంటూ సంయుక్త ప్రకటన విడుదల చేయడం వారి సంకుచిత స్వభావానికి నిదర్శనమని ఎన్డీయే నేతలు చెబుతున్నారు.
అయితే, ఈ కార్యక్రమానికి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, టీడీపీ, ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్, మాజీ ప్రధాని దేవెగౌడ లు హాజరుకానున్నారు. పార్లమెంట్ భవనం ఎవరి వ్యక్తగతం భవనం కాదు, ప్రజల పన్నులతో పార్లమెంటును నిర్మించారని, దానిని ప్రారంభించేది ఎవరైనా అదొక దేవాలయం వంటిది… ప్రారంభోత్సవకార్యక్రమానికి తాను వెళ్తున్నట్టు మాజీ ప్రధాని దేవెగౌడ తెలియజేశారు. అదేమి బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ కార్యాలయం కాదు కదా అని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. కాగా, ఈరోజు ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రతిపక్షాలు రాజకీయాలు చేయాలని చూస్తున్న తరుణంలో ప్రజావ్యాజ్యం దాఖలు కావడం ఒకెత్తైతే, నేడు విచారణ కోర్టు విచారణ జరుపుతుండటం మరోక ఎత్తు. మరి కోర్టు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇస్తుందో చూడాలి.