ఈ రోజుల్లో స్ట్రెస్ అన్నది కామన్‌గా మారింది. చేస్తున్న ఉద్యోగాలను, అవసరాలను బట్టి స్ట్రెస్ పెరుగుతున్నది. ఈ ఒత్తిడి కారణంగా అనారోగ్యాలు కలుగుతుంటాయి. అయితే, స్ట్రెస్‌తో పాటు ఎమోషన్, డిప్రెషన్స్ వంటికి కూడా ఈ కాలంలో పెరిగిపోతున్నాయి. తాజా అధ్యయనం ప్రకారం, వీటి ప్రభావం మెదడులోని ఓ భాగంపై ఉంటుంది. మెదడులో రెండు భాగాలు ఉంటాయి.
New Study on Brain: ఈ రోజుల్లో స్ట్రెస్ అన్నది కామన్‌గా మారింది. చేస్తున్న ఉద్యోగాలను, అవసరాలను బట్టి స్ట్రెస్ పెరుగుతున్నది. ఈ ఒత్తిడి కారణంగా అనారోగ్యాలు కలుగుతుంటాయి. అయితే, స్ట్రెస్‌తో పాటు ఎమోషన్, డిప్రెషన్స్ వంటికి కూడా ఈ కాలంలో పెరిగిపోతున్నాయి. తాజా అధ్యయనం ప్రకారం, వీటి ప్రభావం మెదడులోని ఓ భాగంపై ఉంటుంది. మెదడులో రెండు భాగాలు ఉంటాయి. అందులో ఒకటి ఎడమ అర్థగోళం, కుడి అర్థగోళం. పురుషులు, మహిళలకు ఒకేవిధంగా ఉంటుంది. లింగ వివక్షతను ఎదుర్కొనే మహిళల్లో ఈ బ్రెయిన్లో తేడాలు ఉన్నట్టు యూకేలోని ఆక్స్పర్ట్ యూనివర్శిటీ పరిశోధకులు తెలియజేశారు. అమెరికా, యూకే, చైనా, లాటిన్ అమెరికా, ఇండియా, సౌతాఫ్రికాతో సహా అనేక దేశాల్లో 4078 మంది మహిళలు, 3798 మంది పురుషులపై పరిశోధనలు చేశారు.
యూనివర్శిటి పరిశోధనల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లింగ వివక్షతను ఎదుర్కొనే మహిళల్లోని కుడి హెమిస్పీయర్ లోని కార్టికల్ మందం పురుషుల్లో కంటే తక్కువగా ఉందని గుర్తించారు. వీరు నిరాసక్తితో కూడిన మనసుతో ఉంటారని, ఏదీ సాధించలేమనే భావనలో ఉంటారని, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని భావిస్తుంటారని యూనివర్శిటీ పరిశోధకులు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సైస్ ప్రోసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. అయితే, లింగవివక్ష అంతగా లేని దేశాల్లో కార్టికల్ మందం స్త్రీపురుషులు ఇద్దరిలో ఒకేవిధంగా ఉన్నట్టు రీసెంట్ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. లింగవివక్ష గురించి అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యాన్ని తీసుకొస్తే స్ట్రెస్, ఎమోషనల్ డిప్రెషన్స్ వంటివి తగ్గిపోతాయాని, వారు కూడా మిగతావారిలాగే చురుగ్గా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు.