summer: ఎండాకాలం (Summer) ప్రారంభం నుండే భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో రోజురోజుకి వేసవి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుండే వేడి (Hot)వాతావరణం (Weather) కనపడుతుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు (Temparaturs) క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేడి వాతావరణంతో పిల్లలకు (Children)ల నుంచి వృద్ధులు వరకూ (Aged People) అల్లాడిపోతున్నారు.
summer: ఎండాకాలం (Summer) ప్రారంభం నుండే భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో రోజురోజుకి వేసవి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుండే వేడి (Hot)వాతావరణం (Weather) కనపడుతుంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు (Temparaturs) క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేడి వాతావరణంతో పిల్లలకు (Children)ల నుంచి వృద్ధులు వరకూ (Aged People) అల్లాడిపోతున్నారు.
ఈ జాగ్రత్తలు అవసరం..
వేసవి నుంచి ఉపశమనం (Relief) పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. లేదంటే తలనొప్పి, ఒళ్లుమంట, డీ హైడ్రేషన్ లాంటి సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు. అత్యవసమైతే తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎండ వేడిమికి డీలా పడిపోవాల్సిందే. వేసవి ముగిసేవరకూ ప్రతి ఒక్కరూ, ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే . ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు, తీసుకునే ఆహారంలో, త్రాగే నీటిలో, ధరించే దుస్తులలో ఇక బయటకు వెళ్లినపుడు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు.
వృద్ధులు, పిల్లలతో అప్రమత్తం
సాధారణంగా వృద్ధులు ఎండాకాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని సమయాల్లో ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రాణాలను కూడా కోల్పోతుంటారు. కాబట్టి వృద్ధులు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. ఆహార నియమాలనుంచి నిద్ర వరకు వైద్యుల సలహాలు పాటించాలని వైద్యులు చెపుతున్నారు. వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోవటం వలన వడ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ వడదెబ్బల వలన భౌతికంగా మాత్రమె కాకుండా, శరీరంలో వివిధ రకాల అవయవాలు మరియు అవయవ వ్యవస్థలు, వాటి విధులు, ముఖ్యంగా నాడీ వ్యవస్థ ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ ఉంది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయని వైద్యులు చెపుతున్నారు. చిన్న పిల్లలో మాత్రమె కాకుండా వయసు మీరిన వాళ్ళలో గుండెపోటు వంటి వాటికీ దారితీయవచ్చని అంటున్నారు.
ఎక్సర్సైజ్ చేసే సమయాల్లో ఇలాంటి…
అలాగే ఈ వేసవిలో ఎక్సర్ సైజ్ లు చేసేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెపుతున్నారు. ఎక్కువ సేపు ఎక్సర్ సైజ్ లు చేయకపోవడమే మంచిదని అంటున్నారు.అలాగే ఎక్సర్ సైజ్ లు చేసేటప్పుడు ఎక్కువగా చమటలు పట్టడం జరుగుతుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ కి గురై కళ్ళు తిరగవచ్చు అందుకు ఎక్సర్ సైజ్ లు చేసేప్పుడు గ్యాప్ తీసుకుంటూ ఎక్సర్ సైజ్ లు చేయాలని సూచిస్తున్నారు. ఎక్సర్ సైజ్ ల కంటే ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తే మంచిదని అంటున్నారు.
ఫ్రిజ్లో నీరు తాగొద్దు…
ఎండాకాలం బయట నుంచి రాగానే.. చల్లని నీరు కోసం వెతుకుతాం. పల్లెల్లో అయితే.. చాలా వరకు ఫ్రిజ్ వాడకం తక్కువ కనుక కుండలో నీటిని చల్లబరుస్తారు. పట్టణాల్లో చాలా మంది ఫ్రిజ్ వాడుతారు. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం వెంటనే ఫ్రిజ్ లో వాటర్ తాగేస్తాం. అలా తాగడం ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. ఫ్రిజ్ లో వాటర్ చాలా చల్లగా ఉంటే.. వెంటనే నోట్లోకి పోసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు ఉన్నట్టుండి పడిపోతాయి కనుక … ఫ్రిజ్ లో వాటర్ తొందరగా తాగకుండా.. కొంత సమయం తర్వాత తాగడం మంచిదంటారు. కుండ నీరు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదంటారు.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
వేసవిలో ఎండ నుండి ఉపశమనం పొందాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ నుండి పెరుగుతున్న ఉష్ణోగ్రతల పై హెచ్చరికలు సూచనలు చేయడం జరిగింది. తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఉదయం 11:30 తర్వాత బయటకు వెళ్లకుండా ఉంటె మంచిదంటున్నారు. ఇక పిల్లలు, వృద్దులు, గర్భీణీలు బయటకు పోకపోవడమే ఉత్తమం. వేసవిలో కాటన్ దుస్తులతో పాటు తలగడ ధరించడం శ్రేష్టం. కళ్లజోడు తప్పనిసరి. బయటకు వెళ్లే సమయంలో గొడుగువెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత పెరగకుండా ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవాలి.
మునుముందు మరింత ఉష్ణోగ్రతలు
ఇప్పటికే దేశంలో చాలా రాష్టాల్లో ఎండలు మండిపోతున్నాయి. మరోపక్క, రానున్న ఐదు రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర పెరగవచ్చని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని అప్రమత్తం చేసింది. బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హరియాణా, తెలంగాణ ,ఆంధ్ర లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.. వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండొచ్చు.. బలమైన వడ గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఇందుకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.