బంగాళదుంపల రేటు తక్కువ అనుకుంటా కానీ వాటిలో కూడా అత్యంత ఖరీదైనవి ఉన్నాయి
Potatoes: ప్రపంచంలో బంగాళాదుంపలు (Potatoes) పేదవారి ఆహారంగా భావిస్తారు. ఇవి అన్ని దేశాల్లో కూడా తక్కువ రేటుకే (low Cost) దొరుకుతాయి. అలాగే పిల్లలకు ఇష్టమైన వంటకాలు కూడా ఈ బంగాళాదుంపలతోనే తయారవుతాయి. మన దేశమే కాదు చాలా దేశాల్లో బంగాళాదుంపలను విరివిగా వాడతారు. ఇవి సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా పండుతాయి. కాబట్టి మార్కెట్లలో నిత్యం అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ రేటు కిలో 20 నుంచి 30 రూపాయలు ఉంది. ఇది చాలా తక్కువ. అందుకే ప్రతి ఇంట్లో ఈ దుంపలు కనిపిస్తాయి. కానీ వీటిలోనే అత్యంత ఖరీదైనవి (Expensive potatoes) ఉన్నాయి. అవి కొనాలంటే ఒక నెల జీతాన్ని ఖర్చు చేయాలి. ఈ ఖరీదైన బంగాళదుంప రకం పేరు ‘లే బోనోట్’. ఇవి ఫ్రాన్స్‌లో మాత్రమే పండుతాయి.
వీటి ధర వాటి నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. తక్కువ నాణ్యత గల దుంపలు కిలో 50వేల రూపాయలకి లభిస్తాయి. అదే అధిక నాణ్యత గల దుంపలు కావాలంటే 90 వేల నుంచి లక్ష రూపాయలు వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే ఈ దుంపలను ఎవరు పడితే వారు తినలేరు. కేవలం ధనవంతులు మాత్రమే కొనుక్కొని తింటారు. అలాగే ఖరీదైన రెస్టారెంట్లో మాత్రమే ఈ బంగాళదుంపల వంటకాలు లభిస్తాయి. అంత ధర పలకడానికి కారణం వాటి ఉత్పత్తి తక్కువగా ఉండడమే. ఇవి ఏడాదిలో కేవలం రెండు నెలలు మాత్రమే పండుతాయి. అది కూడా అట్లాంటిక్ మహాసముద్రంలోని లోయర్ ప్రాంతంలో ఉన్న ఒక దీవిలో మాత్రమే పండుతాయి. వీటి రుచి కూడా చాలా బాగుంటుంది. వీటిని మొదటగా ఆ దీవిలోని వ్యక్తి బెనోయిట్ బోనెట్ పండించాడు. అందుకే ఆ బంగాళాదుంపలకు అతని పేరే పెట్టారు. వీటిని పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లోనే పండిస్తారు. వీటిని పెంచడం కూడా చాలా కష్టం.
ఈ బంగాళాదుంపల్లో సాధారణ దుంపలతో పోలిస్తే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పండిస్తారు కాబట్టి, ఎలాంటి ఆరోగ్యకరమైన సైడ్ ఎఫెక్టులు ఉండవు. ఇవి మనదేశంలో లభించవు. వీటిని తినాలంటే ఫ్రాన్స్ వెళ్లాలి. అక్కడ్నించి బయట దేశాలకు ఎగుమతి చేసేంత అధికంగా కూడా ఇవి పండవు. పక్కదేశాలకు కాస్త తక్కువ పరిమితిలే ఎగుమతి అవుతాయి. మనలాంటి దేశాల్లో వీటిని కొనేవారు కూడా ఉండరు.