మణిపూర్ ఉత్తర భారతదేశంలో చాలా అందమైన రాష్ట్రం. ఈ రాష్ట్రం షహీద్ మినార్, మ్యూజియం మరియు సరస్సుకు ప్రసిద్ధి చెందింది. మణిపూర్‌లో ప్రసిద్ధి చెందిన మరో ప్రదేశం మహిళల మార్కెట్.
Ima Keithel : మణిపూర్(manipur) ఉత్తర భారతదేశంలో చాలా అందమైన రాష్ట్రం. ఈ రాష్ట్రం షహీద్ మినార్, మ్యూజియం మరియు సరస్సుకు ప్రసిద్ధి చెందింది. మణిపూర్‌లో ప్రసిద్ధి చెందిన మరో ప్రదేశం మహిళల మార్కెట్. ఈ మార్కెట్ పేరు ఇమా కీథెల్(Ima Keithel). ఇంఫాల్‌లోని(Imphal) ఇమా కీథెల్ మార్కెట్ 500 సంవత్సరాల పురాతనమైనది. ఇమా కీథెల్ అంటే మదర్స్ మార్కెట్. 16వ శతాబ్దంలో మహిళలు (Women’s Market)నిర్వహించే కొన్ని చిన్న స్టాల్స్‌తో ప్రారంభమైన ఈ మార్కెట్ నేడు ఆసియాలోనే (asia)అతిపెద్ద మహిళల మార్కెట్‌గా మారింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ని(manipur) సందర్శిస్తే మాత్రం తప్పకుండా ఇక్కడి మహిళల(womens) మార్కెట్‌ను సందర్శించాల్సిందే. ఇది ఆసియాలోనే అతిపెద్ద మహిళల మార్కెట్(North East India Tour). ఈ మార్కెట్లో ఉన్ని బట్టల నుండి చేనేత మరియు హస్తకళా ఉత్పత్తులతో పాటు, గృహోపకరణాల నుంచి చేతి వృత్తుల వరకు అన్నీ ఈ మార్కెట్లో లభిస్తాయి. ఈ మార్కెట్ ఇంఫాల్ యొక్క ఆర్థిక మరియు వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఈ మార్కెట్ పెద్ద పాత్ర పోషించిందనే చెప్పాలి. ఈ మార్కెట్లో 5000 మంది మహిళలు వ్యాపారం చేస్తున్నారు(Women’s Market). ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ కేవలం వివాహిత స్త్రీలకు మాత్రమే వ్యాపారం చేయడానికి అనుమతి ఉందట. ఈ ఆచారం ఈనాటిది కాదు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఇక్కడ మహిళలు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి యూనియన్ నుండి ఉదారంగా డబ్బు తీసుకుని, తరువాత తిరిగి చెల్లిస్తారట. ఇందులో ఇంకో ఉత్తమమైన విషయం ఏమిటంటే, ఈ మార్కెట్లోని వ్యాపార మహిళలు కరెంట్ అఫైర్స్‌తో అప్డేట్గా ఉంటారు. సామాజిక, రాజకీయ అంశాలపై కూడా వాళ్లు ప్రత్యేకంగా చర్చించుకుంటారు. బహుశా ఈ కారణంగానే ఈ మార్కెట్ ఇంతగా ఫేమస్ అయ్యిందేమో. అందుకే ఇక్కడికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
మీరు ఇమా బజార్(Women’s Market Imphal) నుండి దాదాపు ప్రతిదీ కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ మణిపురి స్త్రీలు చీరలాంటి ఫనెక్ మరియు దుపట్టా లాంటి ఇన్నాఫీలు ధరిస్తారు. ఈ మార్కెట్లో అన్ని రకాల సామాగ్రిలను అమ్ముతారు. ఇక్కడి నుండి కూరగాయలు మరియు తాజా పండ్లు, చేపలు, మాంసం మరియు ఎండిన చేపలు వంటి ఆహార పదార్థాలు, స్థానిక మూలికల నుండి సాంప్రదాయ దుస్తులు మరియు ఉన్ని మరియు వస్త్రాలను కొనుగోలు చేస్తారు. వెదురు మరియు మెటల్ వస్తువులు కూడా ఇక్కడి స్టాల్స్‌లో లభిస్తాయి.
మణిపూర్‌లోని పవోనా బజార్
ఇంఫాల్‌లోని మరొక షాపింగ్ హబ్ పవోనా బజార్ నుండి కూడా షాపింగ్ చేస్తారు. పవోనా బజార్ వీధులు చేతితో నేసిన శాలువాలు, పట్టు చీరలు, వెదురు మరియు దంతపు వస్తువులు వంటి అందమైన వస్తువులను విక్రయించే దుకాణాలతో నిండి ఉంటాయి.
మణిపూర్‌లోని నాగంపాల్ మార్కెట్
మణిపూర్‌లోని నాగంపాల్ మార్కెట్ కూడా ఎంతగానో ప్రసిద్ధిచెందింది. ఈ మార్కెట్లో పాదరక్షలు, ఉపకరణాలు, కూరగాయలు నుండి బట్టలు వరకు అన్ని ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మార్కెట్లో కొన్ని రెస్టారెంట్లు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించవచ్చు.తేరా బజార్ – తేరా బజార్ చేనేతకు చాలా ప్రసిద్ధి. ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది.
GM హాల్
GM హాల్ మార్కెట్ ఇంఫాల్ మధ్యలో ఉంది. ఈ మార్కెట్లో శాలువాలు, హస్తకళలు, బొమ్మల దుకాణాలు చాలానే ఉన్నాయి. కొత్త మరియు ప్రత్యేకమైన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి పర్యాటకులు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలు కూడా ఇక్కడకు వస్తుంటారు