ఒక వ్యక్తి వందమందికి పైగా మహిళలను పెళ్లాడి ప్రపంచ రికార్డును సృష్టించాడు.
Viral : ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 105 మందిని పెళ్లి చేసుకుని ప్రపంచ రికార్డును (World Record) సృష్టించాడు ఒక వ్యక్తి. కేవలం 32 ఏళ్ల వ్యవధిలోనే 105 మందిని పెళ్లాడిన ఆ వ్యక్తి పేరు నికోలాయ్ పెరుస్కోవ్. అతను అమెరికాకు (America) చెందిన వ్యక్తి. ఆయన పెళ్లిళ్లతోనే (Marriages) పెద్ద వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. పెళ్లిళ్లనే ఆయన జీవనాధారంగా మార్చుకున్నాడు. ఏడాదికి ఇద్దరి నుంచి ముగ్గురుని పెళ్లాడాడు నికోలాయ్. అతను అమెరికాలోని 27 రాష్ట్రాలకు చెందిన మహిళలతో పాటూ, పద్నాలుగు దేశాలకు చెందిన మహిళలను పెళ్లాడాడు. ప్రతి పెళ్లి సమయంలో కొత్త గుర్తింపు కార్డుతో పాటూ, పేరునూ వాడాడు. అమ్మాయిల మీద వ్యామోహంతో ఆయన పెళ్లిళ్లు చేసుకోలేదు, కేవలం డబ్బు కోసమే ఇలా చేశాడు.
ప్రాసెస్ ఇలా…
అతను చేసుకున్నవన్నీ ప్రేమ పెళ్లిల్లే. ముందుగా అమ్మాయిని చూస్తాడు. ఆమె లైఫ్ స్టైల్ ని బట్టి ఆమె దగ్గర డబ్బు, ఆభరణాలు, ఇంట్లోని వస్తువులు ఉన్నాయో లేవో అర్థం చేసుకుంటాడు. తరువాత పరిచయం పెంచుకుని, కొన్ని రోజులకే పెళ్లి ప్రపోజల్ పెడతాడు. అమ్మాయిలు ఒప్పుకోగానే ఉంగరం తొడిగేసి పెళ్లి చేసుకుంటాడు. కాపురాన్ని దూరంగా… వేరే ప్రాంతంలో పెడదామని చెబుతాడు. అమ్మాయిల దగ్గర ఉన్న డబ్బులు, ఆభరణాలు తీసుకుని జాగ్రత్తగా దాస్తానని చెబుతాడు. ఇంట్లోని వస్తువులను ట్రక్కులో వేసుకుని కొత్త ఇంట్లో పెట్టి వస్తానని వెళతాడు. అలా వెళ్లిన వాడు మరి భార్య దగ్గరకి రాడు. ఆ వస్తువులను మార్కెట్లో అమ్మేసి సొమ్ము చేసుకునే వాడు. భార్యల పర్సులోనుంచి డబ్బులను కూడా దొంగిలించేవాడు. అలా ఏడాదికి మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని జీవితం గడిపేవాడు. చివరగా 1981లో షారన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇతని ప్రవర్తన నచ్చలేదు. అనుమానం వచ్చి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది.
పోలీసులు వెతికి వెతికి ఆయనను పట్టుకున్నారు. విచారణలో ఆయన చెప్పిన విషయాలు చెప్పి ఆశ్చర్యపోయారు పోలీసులు. అప్పటికే ఆయన 105 మందిని పెళ్లి చేసుకున్నట్టు చెప్పాడు. అలాంటి వ్యక్తిని బయటికి వదిలితే మరింత మందిని పెళ్లి చేసుకునేవాడు. పెళ్లి చేసుకున్న 105 మందిలో ఒక్కరికీ ఆయన విడాకులు ఇవ్వలేదు. అయితే ఏ భార్యనీ తిట్టడం, కొట్టడం లాంటివి చేసే వాడు కాదు, చాలా ప్రేమగా ఉండేవాడు. అందుకే ఎవర అతనిపై కేసు పెట్టలేదు. 105 మంది భార్యలను పెళ్లి చేసుకునే పద్ధతిలో 50 మారుపేర్లను వాడాడు. కొత్త చిరునామాలను, గుర్తింపు కార్డులను సృష్టించాడు. కనీసం తన భార్యలందరి పేర్లు కూడా అతనికి గుర్తు లేవు. అందుకే మర్చిపోకుండా ఉండాలని డైరీలో వారి పేర్లు, చిరునామాలు రాసుకున్నాడు. అతడు చేసిన తప్పులు కోర్టులో నిరూపణ అవ్వడంతో ముప్పై నాలుగేళ్ల శిక్ష పడింది. అలాగే భారీ జరిమానా కూడా పడింది. ఎనిమిదేళ్లు జైల్లోనే గడిపాడు. జైల్లో పెట్టినప్పుడు అతని వయసు 53 ఏళ్లు. ఎనిమిదేళ్ల తరువాత జైల్లోనే మెదడులో రక్తస్రావం అయి మరణించాడు. అతని పెళ్లిళ్ల రికార్డు మాత్రం ఎవరూ బద్దలు కొట్టేలా లేరు.