ఈ మధ్యకాలంలో చిరుతిండ్లు విపరీతంగా తింటున్నారు. కోక్ తాగుతూ చిరుతిండ్లు తినడం అలవాటుగా మారింది. చిరుతిండ్లు తినడం వలన శరీరంలో అనవసరపు ఫ్యాట్ పెరుగుతుంది. దీంతో లేనిపోని ఇబ్బందులు వస్తుంటాయి. నోటికి రుచిగా ఉండటంతో వదలిపెట్టకుండా తింటున్నారు. ఈ చిరుతిండ్లలో కూడా దేనికదే వేరుగా తింటే పర్వాలేదు.
Coke with Chips:ఈ మధ్యకాలంలో చిరుతిండ్లు విపరీతంగా తింటున్నారు. కోక్ తాగుతూ చిరుతిండ్లు తినడం అలవాటుగా మారింది. చిరుతిండ్లు తినడం వలన శరీరంలో అనవసరపు ఫ్యాట్ పెరుగుతుంది. దీంతో లేనిపోని ఇబ్బందులు వస్తుంటాయి. నోటికి రుచిగా ఉండటంతో వదలిపెట్టకుండా తింటున్నారు. ఈ చిరుతిండ్లలో కూడా దేనికదే వేరుగా తింటే పర్వాలేదు. అలా కాకుండా, చిప్స్, కూల్ డ్రింక్స్ కలిపి తీసుకోవడం అనారోగ్యానికి దారి తీస్తుందని యూనివర్శిటీ ఆఫ్ టెనెస్సీ హెల్త్ సైన్స్ సెంటర్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
కోక్ లేదా కూల్‌డ్రింక్స్ తీసుకున్న సమయంలో అందులో ఉండే యాసిడ్లు నాలుకపై ఉండే రుచి గ్రంధుల్లోని సోడియంను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా సోడియం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కోక్‌తో పాటు చిప్స్ ను కూడా తీసుకుంటే అందులో ఉండే ఉప్పు సోడియంతో కలవడంతో అనారోగ్యానికి దారితీస్తుంది. ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్‌ను, కోక్‌ను కలిపి తీసుకుంటే రక్తపోటు, గుండెపోటు వంటివి వస్తాయని, ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. చిప్స్ ను తయారు చేసే కంపెనీలు వీలైనంత వరకు ఉప్పును తక్కువగా వినియోగించేలా చూడాలని పరిశోధకులు తెలియజేస్తున్నారు. వంశపారంపర్యంగా వచ్చే జబ్బులతో పాటు, ఇలా కోక్, చిప్స్ తీసుకోవడం వలన వచ్చే ఈ జబ్బులు మరింత ఇబ్బందులు పెడతాయని అంటున్నారు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చిరుతిండ్లు అధికంగా తీసుకునేవారు ఊబకాయంతో బాధపడుతుంటారు. ఫాస్ట్ ఫుడ్ లో వినియోగించే మసాలాలు, ఇతర సాల్టెడ్ వస్తువులు ఆరోగ్యానికి అంత మంచివి కాదు. వీటి వలన అనేక ఇబ్బందులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.