మనిషి కోతినుంచి పుట్టాడని చార్లెస్ డార్విన్ సూత్రీకరించాడు. ఆ కోతి జాతి ఆఫ్రికాలో మనిషిగా పరిణామం చెంది భూగోళమంతా పాకిపోయిందని ఆంత్రోపాలజిస్టులు ప్రతిపాదించారు.
unknown facts about human birth : మనిషి కోతినుంచి పుట్టాడని చార్లెస్ డార్విన్ (darwin)సూత్రీకరించాడు(human birth). ఆ కోతి(monkey in human body) జాతి ఆఫ్రికాలో(africa) మనిషిగా పరిణామం చెంది భూగోళమంతా పాకిపోయిందని ఆంత్రోపాలజిస్టులు ప్రతిపాదించారు. ఆధునిక మానవులకు పూర్వీకులైన హోమో సేపియన్స్ ఆఫ్రికాలోని ఒకే ప్రాంతం నుంచి వచ్చారని ఇప్పటివరకూ భావిస్తున్నారు. కానీ, ఈ సూత్రీకరణను తాజా పరిశోధన ఒకటి సవాల్ చేస్తున్నది.మనిషి కోతినుంచి(human birth) పుట్టాడని చార్లెస్ డార్విన్ (Charles Darwin)సూత్రీకరించాడు. ఆ కోతి జాతి ఆఫ్రికాలో మనిషిగా పరిణామం చెంది భూగోళమంతా పాకిపోయిందని ఆంత్రోపాలజిస్టులు ప్రతిపాదించారు. ఆధునిక మానవులకు పూర్వీకులైన హోమో సేపియన్స్ ఆఫ్రికాలోని ఒకే ప్రాంతం నుంచి వచ్చారని ఇప్పటివరకూ భావిస్తున్నారు. కానీ, ఈ సూత్రీకరణను తాజా పరిశోధన ఒకటి సవాల్ చేస్తున్నది. మనిషి పూర్వీకులు ఒకేజాతి కాదని, ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలకు చెందిన వలస జాతుల మధ్య సంపర్కం ఏర్పడి నేటి మానవుడు అవతరించాడని తాజాగా పరిశోధకులు చెప్తున్నారు.
భిన్న జాతుల కలయికతోనే మనిషి అవతరించాడా?
అతుకుల బొంత
మనిషి బతుకు అతుకుల బొంత అని పరిశోధకులు అంటున్నారు. మనిషి జన్యు నిర్మాణంలో అనేక వైరుధ్యాలున్నాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన జన్యు పరిశోధకులు బ్రెన్నా హెచ్ అంటున్నారు. మనిషి పూర్వీకులు ఒకే జాతివారా? భిన్న జాతుల కలయిక వల్ల మనిషి అవతరించాడా? అన్న అంశంపై ఆఫ్రికాలో పలువురు పరిశోధకులు దశాబ్దాలుగా పరిశోధన నిర్వహిస్తున్నారు. తాజాగా వీరి పరిశోధన వ్యాసం నేచర్ జర్నల్లో ప్రచురితమైంది. ఆఫ్రికాలోని భిన్న ప్రాంతాలకు చెందిన 290 మంది మానవుల జన్యు క్రమాలను వీరు విశ్లేషించారు. సియెర్రాలియోన్లోని మెండే ప్రాంతంలో నివసించే రైతులు, ఇథియోపియాలోని గుముజ్లో నివసించే వేటాడే సమూహాలు, అమ్హరా రైతులు, దక్షిణాఫ్రికాలోని నమా జాతి వేటగాళ్లు.. ఇలా అనేక భిన్న జాతులనుంచి నమూనాలు సేకరించి జన్యువులను విశ్లేషించారు.
దీంతో ఇప్పటివరకూ భావిస్తున్నట్టు ఆఫ్రికాలోని ఒకే ఒక్క ప్రాంతం నుంచి ఆధునిక మానవుడు అవతరించలేదని, భిన్న ప్రాంతాల్లోని తెగల కలయిక వల్ల హోమో సేపియన్స్ అనే జాతి పుట్టిందని ప్రతిపాదించారు. ఒకరకంగా చెప్పాలంటే మనిషి జన్యుక్రమం ఒక అతుకుల బొంతలాంటిదని పేర్కొన్నారు. 10 లక్షల ఏండ్ల క్రితమే ఈ జాతుల కలయిక చోటుచేసుకొన్నదని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్కు చెందిన పాపులేషన్ జెనటిస్ట్ ఆరోన్ రగ్స్డేల్ తెలిపారు. ‘ఆధునిక మానవులకు హోమో సేపియన్స్ అనే ఒకే ఒక పూర్వీకులున్నారు. కానీ, మరింత లోతుగా వెళ్లి పరిశీలిస్తే హోమో సేపియన్స్కు అనేక జాతుల పూర్వీకులున్నారని తేలింది’ అని వివరించారు.