సాధారణంగా తప్పు చేసిన వారికి శిక్షలు విధిస్తుంటారు. తప్పు చేసినపుడు శిక్ష అనుభవించక తప్పుదు. ఇది వాస్తవం. చేసిన తప్పులను అనుసరించి శిక్షలు విధిస్తుంటారు. శిక్ష అనుభవించిన తరువాత వారిలో మార్పులు వస్తుంటాయి. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియే. అయితే, కొందరు తప్పుచేసి, వెంటనే రియలైజ్ అయ్యి జీవితాన్ని బంగారుమయం చేసుకుంటారు.
Tree Arrested from 125 years: సాధారణంగా తప్పు చేసిన వారికి శిక్షలు విధిస్తుంటారు. తప్పు చేసినపుడు శిక్ష అనుభవించక తప్పుదు. ఇది వాస్తవం. చేసిన తప్పులను అనుసరించి శిక్షలు విధిస్తుంటారు. శిక్ష అనుభవించిన తరువాత వారిలో మార్పులు వస్తుంటాయి. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియే. అయితే, కొందరు తప్పుచేసి, వెంటనే రియలైజ్ అయ్యి జీవితాన్ని బంగారుమయం చేసుకుంటారు. మనిషన్నాక తప్పుచేయడం సహజం. ఈమధ్యకాలంలో మనుషులనే కాదు జంతువులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కోడి, మేక, కుక్క, బాతు వంటికి కూడా శిక్ష అనుభవిస్తున్నాయి. మనిషంటే ఏదో విధంగా రియలైజ్ అవుతారు. జంతువుల పరిస్థితులు ఏంటి? నోరులేని జీవాలు ఎలా బయటపడతాయి… వాటి రక్షణ ఎలా?
జంతువులను వివిధ కేసుల్లో అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన దృశ్యాలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. అయితే, వాటి బాధలు పడలేక, వాటి అరుపులను తట్టుకోలేక విడిచిపెడుతుంటారు.ఇవి సరే, బాధను చెప్పుందుకు నోరులేని, మనసులేని చెట్ల పరిస్థితి ఏంటి? వాటి బాధలు బయటకు ఎలా చెప్పుకుంటాయి? రాళ్లతో కొట్టినా, చెట్ల మానును నరికివేసిన ఏమీ చేయలేక మౌనంగా భరిస్తూ ఉంటాయి. అయితే, ఓ చెట్టుకు సంబంధించిన ఓ సంఘటన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. అదేమంటే, గత 125 ఏళ్లుగా ఓ మర్రిచెట్టు శిక్షను అనుభవిస్తూ ఉంది. ఆ చెట్టుకు సంకెళ్లు వేసి ఉన్నాయి. చెట్టుకు ఐయామ్ అండర్ అరెస్ట్ అని రాసిన బోర్డు తగిలించి ఉంది. ఈ చెట్టును 1898లో ఓ బ్రిటిష్ అధికారి అరెస్ట్ చేశాడు. ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది అంటే… బ్రిటిష్ అధికారి జేమ్స్ నిద్రిస్తున్న సమయంలో ఆ చెట్టు అతడి మీదకు వచ్చినట్టు భావించాడు. వెంటనే సార్జెంట్లను పిలిచి ఆ చెట్టకు సంకెళ్లు వేయించాడు. అప్పటి నుంచి ఆ సంకెళ్లు అదేవిధంగా ఉన్నాయి. 125 ఏళ్లుగా ఆ చెట్టు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నది.