World Biggest Pizza By Pizza Hut: ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జా ఇదే
World Biggest Pizza By Pizza Hut: విదేశాలకే పరిమితమైన పిజ్జా, బర్గర్ వంటివి ఇప్పుడు ఇండియాలోనూ ఫేమస్ అయ్యాయి. ప్రపంచంలో అత్యథికంగా పిజ్జాలు, బర్గర్లు మనదేశంలోనే అమ్ముడవుతున్నాయి. పిజ్జా అంటే ఎంత ఉంటుంది. మామూలుగా మన దోశ ఏ సైజ్‌లో ఉంటుందో అంతకంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ పిజ్జా ఎంత సైజ్ ఎంత ఉందో తెలిస్తే నోరెళ్లపెట్టేస్తారు. ఈ పిజ్జా సైజ్ 13,990 చదరపు అడుగులు. ఇంత పెద్ద పిజ్జా తయారు చేయడానికి ఎంతెంత ఇంగ్రేడియంట్స్ వినియోగించారో తెలిస్తే వామ్మో అనేస్తాం. ఈ పిజ్జాను తయారు చేయడానికి 6,193 కిలోల పిండిని, 3,990 కిలోల చీజ్‌ను వినియోగించారు.
ఈ పిజ్జాను ప్రముఖ పిజ్జా తయారీ సంస్థ పిజ్జా హట్ తయారు చేసింది. లాజ్ ఏంజెల్స్‌లోని కమ్యూనిటీ సెంటర్‌లో ఈ పిజ్జాను తయారు చేశారు. న్యూయార్క్‌కు చెందిన యూట్యూబర్ ఎరిక్ డెకర్‌తో కలిసి ఈ జెయింట్ పిజ్జాను తయారు చేశారు. ఈపిజ్జాను తయారు చేయడానికి రెండు రోజుల సమయం పట్టినట్లు నిర్వాహకులు తెలియజేశారు. పిజ్జా తయారీలో 6,193 కిలోల పిండితో పాటు 4,948 పౌండ్ల టమోటా సాస్‌ను, 6,30,496 పెపరానీ పీసులను వినియోగించారు. 68 వేల స్లైస్‌ల ఈ పిజ్జా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కింది. 2012లో ఇటలీకి చెందిన పిజ్జా చెఫ్‌లు తయారు చేసిన జెయింట్ పిజ్జాను లాజ్ ఏంజల్స్ పిజ్జా బీట్ చేసినట్లు పిజ్జా హట్ సీఈవో డేవిడ్ గ్రేవ్స్ తెలియజేశారు.