Microsoft: ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ ఫ్రం హోమ్.. సాయంత్రం ర్యాపిడో డ్రైవర్
Microsoft Employee as Rapido Driver: ఐటీ ఉద్యోగులు గత సంవత్సరం నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కానీ వారికి ఇంట్లో ఉండి బోర్ కొడుతుందట్టుంది. సాయంత్రం కాగానే బైకెక్కి వీధుల్లో తిరుగుతున్నారు. వీధుల్లో తిరగడం అంటే పోకిరీ పని కాదండోయ్. క్యాబ్, టూవీలర్లకు డ్రైవర్లుగా చేస్తున్నారు. మరికొందరు స్విగ్గీ, జొమాటో డెలవరీ బాయ్స్‌గా మారిపోతున్నారు. రోజంతా నాలుగు గోడల మధ్య ఉన్న ఉద్యోగులు సాయంత్రం కాగానే నలుగురితో కలిసి తిరిగినట్లు ఉంటుందని, పార్ట్‌టైమ్ జాబ్ చేసినట్లు కూడా ఉంటుందనే బైక్ ఎక్కుతున్నారు.
బెంగళూరుకు చెందిన నిఖిల్ సెఠ్ అనే వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. బెంగళూరులోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ర్యాపిడో బుక్ చేసుకొని, ఆ బైక్ ఎక్కి తన గమ్యస్థానానికి వెళ్తున్నాడు. ఆదే సమయంలో మార్గం మధ్యలో డ్రైవర్‌తో ముచ్చట్లు ప్రారంభించాడు ఈ సిటిజన్. డ్రైవర్‌ను నువ్వు ఇలా రోజంతా బైక్ డ్రైవ్ చేస్తూ ఎంత సంపాదిస్తావు అని అడిగాడు. దానికి డ్రైవర్ తాను మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. టైంపాస్‌కు ఇలా ర్యాపిడోలో డ్రైవర్‌గా చేస్తున్నానని అనడంతో ప్యాసింజర్ అవాక్కయ్యాడు. 24 గంటలు ఇంట్లో ఉండలేక ఇలా సరదాగా ఉద్యోగం చేస్తున్నట్లు ఆ ఉద్యోగి తెలిపాడు.