HuggieBot 3.0 హగ్స్ ఇచ్చేందుకూ ఒక రోబోట్!
HuggieBot 3.0: మనుషులు కౌగిలించుకోవడానికి ఇష్ట పడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మానవులు తమ భావాలను మార్పిడి చేసుకోవడానికి ఈ ప్రత్యేక శారీరక టచ్ కోసం పరితపిస్తూ ఉంటారు. చుట్టుపక్కల మనుషులెవరూ లేకుంటే, పెంపుడు జంతువును లేదా దిండును కౌగిలించుకుంటారంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో జర్మనీకి చెందిన మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ శాస్త్రవేత్తలు హగ్గీబాట్ 3.0 అనే రోబోను అభివృద్ధి చేశారు. దీనిని కౌగిలించుకోవడం వల్ల ఒక వ్యక్తి యొక్క ఆందోళన మరియు ఒత్తిడి స్థాయి తగ్గుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ది డీకోడర్ అనే వెబ్‌సైట్ ప్రకారం, ఈ రోబోట్‌ను జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ రోబోట్‌ను అలెక్సిస్ ఇ. బ్లాక్ సహా అతని సహచరులు సంవత్సరాల తరబడి కష్టపడి తయారు చేశారు. శాస్త్రవేత్తల ప్రకారం, మనిషిలాగా కౌగిలించుకోవడం ద్వారా, ప్రజల సమస్యలు పోతాయి, ఒంటరితనం కూడా దూరమవుతుంది. ఈ రోబోట్ యొక్క మొదటి వెర్షన్ 2018లో ప్రదర్శించబడింది. అప్పుడు ప్రజలు కౌగిలించుకోవడానికి ఎలా ఇష్టపడతారో పరీక్షించారు. దీనితో పాటు ప్రజలు ఎవరిని కౌగిలించుకోవాలనుకుంటున్నారో కూడా ప్రత్యేకంగా పరీక్షించారు.