Vietnamese Dragon Chicken: లక్షలు పలుకుతున్న డ్రాగన్ చికెన్ … ధర అక్షరాల రెండు లక్షలు
Vietnamese Dragon Chicken: సాధారణంగా చికెన్ ధర ఎంత ఉంటుంది మహా అయితే 150 నుండి 300 మధ్యలో ఉంటుంది. నాటుకోడి చికెన్ ధర రూ. 400 వరకు ఉంటుంది. గిన్నెకోడి, టర్కీ కోళ్ల ధరలు కూడా రెండు మూడు వేల కంటే ఎక్కువ ఉండవు. కానీ, ఈ కోడి ధర చూస్తే వామ్మో అని నోరేళ్లబెట్టేస్తాము. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ కోడి ధర అక్షరాల రూ. 1.70 లక్షలు. ఇంత ధర పలుకుతోంది అసలు ఇది కోడేనా అనే అనుమానం రావొచ్చు. ఈ కోడిని వియాత్నం డ్రాగన్ కోడి అని పిలుస్తారు. దీని శరీరం సాధారణ కోడిమాదిరిగానే ఉన్నా, కాళ్లు మాత్రం చాలా బలంగా ఉంటాయి. పెద్దవిగా కండలు తిరిగి ఉంటాయి.
వీటి కాళ్లకు యమా డిమాండ్ ఉంటుంది. లైవ్ కోడి ఒక్కోక్కటి సుమారు నాలుగు కేజీల వరకు పెరుగుతుంది. కిలోకు 1.70 లక్షల చొప్పున వసూలు చేస్తారు. చికెన్ అయితే అక్షరాల రెండు లక్షల వరకు ఉంటుంది. దీనికి పెట్టే ఆహారం దగ్గరి నుండి వ్యాయామం వరకు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. నాణ్యమైన మొక్కజొన్న, బియ్యంతో తయారైన ప్రత్యేకమైన ఆహారాన్ని దీనికి అందిస్తారు. అంతేకాదు, వీటికి ప్రత్యేకమైన వ్యాయామం కూడా అందిస్తారు. ఎక్కువగా వీటికి నడకను వ్యాయామంగా అందిస్తారు. ఈ రకం కోళ్లు ఎంత ఎక్కువగా నడిస్తే కాళ్లు అంత బలంగా ఉంటాయి. ఈ రకం కోళ్లను వియాత్నంలోని డాంగ్ టావో రకం కమ్యూనిటీవారు పెంచుతుంటారు. ఒకప్పుడు ఈ రకం కోళ్లను రాజకుటుంబాలు స్టేటస్ సింబల్ కోసం పెంచుతుండగా, ఇప్పుడు ఈ రకం కోళ్లను ఆహారం కోసం పెంచుతున్నారు.