Holi Festival: హోలీ తరువాత ఇలా చేయండి… రంగులు ఈజీగా వదిలిపోతాయి
Holi Festival: దేశంలో జరిగే అతిపెద్ద పండుగల్లో హోలీ కూడా ఒకటి. హోలీ కోసం దేశ ప్రజలు సిద్దమౌతున్నారు. వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. డీజేలను ఏర్పాటు చేసుకొని, గులాములు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. రంగులను చల్లుకొని వేడుకలు చేసుకోవడం ఒకెత్తైతే, చర్మంపై పడిన రంగులను పొగొట్టుకోవడం మరోఎత్తు. చర్మంపై పడిన రంగులను పొగొట్టుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతుంటారు. శరీరంపై హోలీ రంగులు పడిన తరువాత స్నానం చేసేందుకు వెంటనే షవర్‌లోకి వెళ్లకూడదు.
షవర్ బాత్ చేసే ముందు తప్పనిసరిగా ఫేషియల్ ఆయిల్‌ను అప్లై చేయాలి. కాటన్‌తో ఫేషియల్ ఆయిల్‌ను అప్లై చేయడం ద్వారా రంగులను పోగొట్టుకోవచ్చు. లేదా సున్నితమైన క్లెన్సర్‌ను వినియోగించడం ద్వారా కూడా రంగులను క్లీన్ చేసుకోవచ్చు. స్కిన్ మాయిశ్చర్‌ను వినియోగించి కూడా శరీరంపై పడిన రంగులను క్లీన్ చేసుకోవచ్చు. కెమికల్ లేని షాంపూలను యూజ్ చేసి కూడా రంగులను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా రంగులను శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక సీరమ్‌ను యూజ్ చేయడం వలన జుట్టు నిగారిస్తుంది. జుట్టు నిగారించడం వలన మృధుత్వాన్ని పెంచుతుంది.