Ozone Layer Healing: గుడ్ న్యూస్… మానవాళికి ముప్పు తప్పినట్టే
Ozone Layer Healing: సూర్యుడి నుండి వెలువడే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలను భూమిపైకి డైరక్ట్‌గా పడకుండా ఓజోన్ లేయర్ అడ్డుకుంటున్నది. అయితే, రసాయనాలు, ఓజోన్ పొరను దెబ్బతీసే క్లోరోఫ్లోరో ఉద్గారాలను వినియోగంచడం వలన అర్కిటక్ సముద్రంపై ఉన్న ఓజోన్ పొర దెబ్బతిన్నది. రంధ్రం ఏర్పడింది. ఈ సంఘటన 46 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటి నుండి ప్రపంచదేశాలను ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తూ వస్తున్నది. ప్రమాదకరమైన, పర్యావరణానికి, ఓజోన్ పొరకు హానికలిగించే రసాయనాలను వినియోగించడం తగ్గించాలని, అవసరమైతే పూర్తిగా వాటిని బ్యాన్ చేయాలని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
ఈ క్రమంలోనే కొన్ని రసాయనాల వినియోగాలను తగ్గించగా, మరికొన్నింటిని పూర్తిగా నిషేధించారు. ఫలితంగా నేడు ఓజోన్ పొర క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి సైంటిఫిక్ ప్యానల్ కో చైర్మన్ పాల్ పేర్కొన్నారు. ప్రతి నాలుగేళ్లకు ఒకమారు శాస్త్రవేత్తలు ఓజోన్ పొర మందంపై నివేదికలు సమర్పిస్తుంటారు. ఈ ఏడాది సమర్పించిన నివేదికలు ఆశాజనకంగా ఉండటం విశేషం. 2040 నాటికి ఈ రంధ్రం పరిమాణం 30 కిలోమీటర్లకు తగ్గే అవకాశం ఉంటుందని, 2066 నాటికి హోల్ పూర్తిగా మూసుకుపోతుందని తద్వారా మానవాళికి ఇబ్బందులు లేకుంటా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఓజోన్ పొర దెబ్బతినకుండా ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అవే జాగ్రత్తలను కూడా భవిష్యత్తులో తీసుకోవాలని, తద్వారా మాత్రమే ఓజోన్ పొర దెబ్బతినకుండా కాపాడుకోగలమని పరిశోధకులు పేర్కొన్నారు.