పదిహేడేళ్లుగా శీతల పానీయాలు తాగుతూ జీవిస్తున్న ఒక వ్యక్తి కథనం ఇది.
Viral News : ఒక పూట అన్నం (Food) తినకపోతేనే ఏదోలా అనిపిస్తుంది. శక్తి లేనట్టుగా అయిపోతారు ఎంతోమంది. కానీ ఒక వ్యక్తి గత 17 ఏళ్లుగా రోజంతా శీతలపానీయాలు (Cool Drinks) తాగుతూ బతుకుతున్నాడు. ఎలాంటి ఘనాహారాన్ (Solid Food)ని తీసుకోవడం లేదు. అతని పేరు గోలామ్‌రెజా అర్దెర్షిని. ఇతను ఇరాన్‌కు (IRan) చెందిన వ్యక్తి. తనకి ఆకలి వేయడం లేదని అందుకే ఆహారం తినడం మానేశానని చెబుతున్నాడు ఇతను. అలసటగా అనిపించినప్పుడు తిరిగి శక్తి పొందడానికి పెప్సీ, కోకోకోలా వంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగుతున్నట్టు చెప్పాడు.
ఈ వ్యక్తి చివరిగా 2006 జూన్ నెలలో ఘనాహారాన్ని తిన్నాడు. ఆ తర్వాత నుంచి ఆయనకి ఆకలి వేయడం మానేసింది. ఎందుకిలా జరిగిందో కూడా తనకు తెలియదని చెబుతున్నాడు. తాను ఎలాంటి షాక్‌కు గురి కాలేదని, ఎలాంటి ప్రమాదాలు జరగలేదని అయినా కూడా తనకు ఆకలి పూర్తిగా పోయిందని వివరిస్తున్నాడు. అయితే ఘనాహారాన్ని మానేసే ముందు తనకు ఒక వింత అనుభూతి కలిగిందని, నోటిలో వెంట్రుక వంటి వస్తువు ఉన్నట్లు అనిపించిందని చెప్పారు. ఆ వెంట్రుక నోటిలో నుంచి నా పొట్ట దాకా ఉన్నట్టు అనిపించిందని దాన్ని తొలగించడం కూడా సాధ్యం కాలేదని వివరించారు. గొంతులో ఆ వెంట్రుకను పట్టుకుని ఎవరో లాగుతున్నట్టు అనిపిస్తుందని, ఊపిరాడనట్లు అవుతుందని, ఆ సమయంలో ఏమి చేయాలో అర్థం కాదని చెబుతున్నాడు.
ఇలా ఎందుకు అనిపిస్తుందో తెలుసుకోవడం కోసం అతను ఎంతో మంది వైద్యులను సంప్రదించినా సమస్య ఏంటో తేల్చలేకపోయారు. అప్పటినుంచి ఇలా కేవలం కూల్ డ్రింకులు తాగుతూ బతుకుతున్నట్టు చెప్పారు. అతను కుటుంబం కూడా అతని ముందు ఎలాంటి ఆహారాన్ని తినదు. ఎందుకంటే వారు తింటున్నప్పుడు ఇతను చూస్తే వికారంగా వాంతి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకే అతని ముందు ఏమీ తినడం మానేశారు కుటుంబసభ్యులు. రోజుకు మూడు లీటర్ల కూల్ డ్రింకులు తాగడం ద్వారా జీవిస్తున్నట్టు వివరించాడు ఆయన. ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్యాలు రాలేదని చెబుతున్నారు. పోషకాహారం లోపం కూడా లేదని, తన ఉద్యోగం తాను చేసుకుంటున్నానని వివరిస్తున్నాడు.