పొట్ట సమస్యలు అంత త్వరగా బయటపడవు. అలాంటిదే అల్సర్లు కూడా. ఈ సమస్య వస్తే చికిత్స అవసరం. లేకపోతే పొట్ట ఆరోగ్యం పాడవుతుంది.
Stomach ulcers : పొట్ట సమస్యలు (Stomach Problems) అంత త్వరగా బయటపడవు. అలాంటిదే అల్సర్లు (Ulcers) కూడా. ఈ సమస్య వస్తే చికిత్స (Treatment) అవసరం. లేకపోతే పొట్ట ఆరోగ్యం (Gut Health) పాడవుతుంది. ఇది రావడానికి ముఖ్య కారణం హెలికోబ్యాక్టర్ పైలోరి అనే బాక్టీరియా. ఇది పొట్ట చుట్టూ ఉండే సున్నితమైన మ్యూకస్ మెంబ్రైయిన్ అయిన పొరను దెబ్బతీస్తుంది. దీంతో పొట్ట లైనింగ్ పై (Stomach Lining) పుండ్లు ఏర్పడతాయి. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువైనా కూడా ఈ పొర దెబ్బతినే అవకాశం ఉంది. అలాంటి సమయంలో అల్సర్లు (Ulcers) వస్తాయి. చాలా మంది వీటిని గ్యాస్, ఎసిడిటీగా అనుకొని వదిలేస్తారు. అలా వదిలేస్తే తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా వదిలేస్తే అవి క్యాన్సర్లుగా కూడా మారొచ్చు. కాబట్టి వీటికి కచ్చితంగా చికిత్స తీసుకోవాలి.
లక్షణాలు ఎలా ఉంటాయంటే…
పొట్టలో అల్సర్లు వస్తే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. పొట్ట నొప్పిగా అనిపిస్తుంది. వాంతులు అయ్యే అవకాశం ఉంది. ఆహారం కూడా సరిగా జీర్ణం అవ్వదు. అజీర్తిగా అనిపిస్తుంది. అల్సర్ల వల్ల రక్తహీనత సమస్య కూడా వస్తుంది. బరువు చాలా త్వరగా తగ్గిపోతారు. ఛాతిలో సన్నని నొప్పి మొదలవుతుంది. నలుపు రంగు కనిపిస్తుంది. కొన్నిసార్లు రక్తస్రావం కూడా అవ్వచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అల్సర్ ఏమో అనుమానించాలి. వెంటనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
ఇలాంటి ఆహారాలు…
పొట్ట మంటగా అనిపిస్తున్నా, అల్సర్లు ఉన్నా కూడా కొన్ని రకాల ఆహారాలు ప్రత్యేకంగా తినాలి. మరికొన్ని దూరంగా పెట్టాలి. పండ్లను తరచూ తినాలి. కూరగాయలతో కారం లేకుండా కూరలు వండుకుని తినాలి. చిక్కుళ్లతో వండిన ఆహారాన్ని అధికంగా తినాలి. గ్రీన్ టీ రోజూ తాగడం అలవాటు చేసుకోవాలి. గుడ్లు, చేపలు తినడం మంచిది.
ఇవి వద్దు…
అల్సర్లు ఉన్న వారు వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక కొవ్వు ఉండే పదార్థాలు కూడా తినకూడదు. కొవ్వు నిండి మాంసానికి దూరంగా ఉండాలి. మటన్ తినడం తగ్గించాలి. పాలు కూడా తగ్గించాలి. కాఫీ, ఆల్కహాల్ వంటి పానీయాలకు దూరంగా ఉండాలి. కాఫీలో కెఫీన్ అధికంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల అల్సర్లు పెరుగుతాయి.