The Hotel Room In Ibiza : ఈ స్టార్ హోటల్లో ఫ్రీగా ఉండొచ్చు… కానీ కండిషన్స్ అప్ప్లై
The Hotel Room In Ibiza Which You Can Stay In For Free : ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హోటళ్లలో స్టే చేయడం మాములే. అయితే తాజాగా ఓ హోటల్ లో ఫ్రీగా స్టే చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదికూడా స్టార్ హోటల్లో కావడం విశేషం. స్పెయిన్లోని ఇబిజా ద్వీపంలో ఒక హోటల్ ఉంది. ఇందులో ఫ్రీగా స్టే చేయొచ్చు. కానీ ఒక్క కండిషన్… ఆ రూమ్ లో వాళ్ళు ఏం చేస్తున్నా అందరూ చూడాల్సిందే. మనం ఎక్కడైనా హోటల్ లో ఉండాల్సి వస్తే ఆలోచించేది ప్రైవసీ గురించి. ముఖ్యంగా పరిశుభ్రత, భద్రత వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటాం. కానీ ఈ హోటల్లో ప్రైవసీ ఉండదు. ఎందుకంటే పారదర్శకమైన రూమ్ లో ఉండాల్సి ఉంటుంది. ఈ కండిషన్ ను ఓకే అయితే రూమ్ లో ఫ్రీ గా స్టే చేయొచ్చు. అయితే అటుగా వెళ్లే వారి కళ్లు నిత్యం ఇక్కడ ఉంటున్న వ్యక్తిపై పడుతూనే ఉంటాయి. స్పెయిన్లోని పారడిసో ఆర్ట్ హోటల్లో ఈ జీరో సూట్ ను నిర్మించారు. ఈ సూట్ హోటల్ లాబీలో ఉంటుంది. అంటే ఇక్కడ నుండి వచ్చే, వెళ్ళే ప్రతి ఒక్కరూ గదిలో ఉండే వారిని చూస్తారన్న మాట. పారాడిసో తన వెబ్సైట్లో దీని గురించి సమాచారాన్ని ఇస్తూ పారాడిసో ఆర్ట్ హోటల్ లాబీలో ఒక గాజు గోడల గది నిర్మించబడిందని, ఇక్కడ మీరు ఒక రాత్రి ఉచితంగా నిద్రించవచ్చని, ఇందులో కళాత్మక ప్రదర్శన, రేడియో బ్రాడ్కాస్ట్, డీజే సెట్ కూడా అందుబాటులో ఉందని వెల్లడించారు. అయితే అన్ని గదులూ ఇలాగే ఉండవు.