Teaching with Songs: పాటలతో టీచరమ్మ పాఠాలు
Teaching with Songs: సాధారణంగా మనిషి మెదడు ఒక విషయాన్ని దృశ్యరూపంలోనే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటుంది. అందుకే ఎక్కువ సార్లు చదివిన విషయాల కంటే, చూసినవే గుర్తుంటాయి. చూసిన వాటిని జ్ఞప్తికి తెచ్చుకోవడం ఈజీ. విద్యార్థులకు సినిమాలు, అందులోని పాటలు గుర్తుంచుకున్నంత ఈజీగా పుస్తకాలు, అందులోని పాఠాలు, టీచర్ చెప్పిన విషయాలు గుర్తుండవు. చదివే విధానంలో మార్పులు రావాలి. చదువుతున్న అంశాన్ని దృశ్యరూపంలో ఊహించుకుంటూ చదివితే అది తొందరగా అర్థం అవుతుంది. మెదడులో స్టోర్ అవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఓ టీచరమ్మ పిల్లలకు పాఠాలు అర్థమయ్యేలా చెప్పేందుకు పాటలను ఎంచుకున్నారు.
అందులోనూ బాగా పాపులైన పాటలను ఎంచుకొని, ఆ పాటలను పాఠాలకు అన్వయించి అర్థం అయ్యేలా బోధిస్తున్నారు. దీంతో పిల్లలు సైతం ఆసక్తిగా వింటూ నేర్చుకుంటున్నారు. ఇటీవలే వచ్చిన సూపర్ హిట్ సినిమా లవర్స్ లోని సారంగ ధరియా పాటను హిస్టరీ పాఠాలకు అన్వయించి పిల్లలకు బోధించారు. ఇండియా మ్యాప్‌లోని విషయాలను అద్భుతంగా పాట రూపంలో పాడుతూ, పిల్లల చేత పాడించారు. ఎడం భుజం మీద నేపాల్, దానిపైనే ఉంది చైనా, కుడి భుజం మీద పాకిస్తాన్ దానిపైనే ఉంది ఆఫ్ఘనిస్తాన్ అంటూ పాడుతూ పిల్లల చేత మ్యాప్ గురించి పాడిస్తూ పాఠాలు బోధించారు టీచరమ్మ సాధన. ప్రస్తుతం టీచరమ్మ పాటల పాఠాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.