నవ్వుకు నిజంగానే గొప్ప హీలింగ్ పవర్ ఉందట, అనేక అనారోగ్యాల బారి నుంచి అది ఈజీగా కాపాడుతుందట..చివరకు గుండె జబ్బులు(Heart diseases) వంటి ప్రాణాంతమైన ప్రమాదాలను కూడా నివారిస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది.
Smile heartily : ఒకప్పుడు ఎవరైనా నవ్వితే.. అలా నవ్వకు.. నవ్వు(laugh) నాలుగు విధాలా చేటు అని పిల్లలకు, కుటుంబసభ్యులకు పెద్దలు చెప్పేవారు. కానీ కాలం మారింది. అలాగే ఆ మాట మారిపోయింది. నవ్వు(laugh).. హాయిగా.. మనసారా నవ్వు.. ఎందుకంటే నవ్వు 40 విధాల మంచిది అనేలా నవ్వు గురించి మాట మారిపోయింది. చివరకు అధ్యయనకర్తలు,డాక్టర్లు కూడా ఇవే మాటలను పదేపదే చెబుతున్నారు.
దీనివల్లే లాఫింగ్ థెరపీ(Laughing therapy)లకే చాలామంది ప్రయారిటీ ఇస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. అవును.. నవ్వుకు నిజంగానే గొప్ప హీలింగ్ పవర్ ఉందట, అనేక అనారోగ్యాల బారి నుంచి అది ఈజీగా కాపాడుతుందట..చివరకు గుండె జబ్బులు(Heart diseases) వంటి ప్రాణాంతమైన ప్రమాదాలను కూడా నివారిస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది.ఎందుకంటే నవ్వడం వల్ల.. గుండె కణజాల విస్తరణను ప్రేరేపిస్తాయట. అంతేకాదు బాడీ మొత్తానికి ఆక్సిజన్ సర్క్యులేషన్ పెంచడం వల్ల గుండె ఆరోగ్యంపై నవ్వు చాలా ప్రభావంతమైన మార్పు చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తాజాగా గుండెకు సంబంధించిన డిసీజ్ సింప్టమ్స్‌ను పరిష్కరించడంలో.. లాఫింగ్ థెరపీ ఎలా సహాయపడుతుందోనని తెలుసుకోవడానికి కరోనరీ ఆర్టరీ డిసీజ్(Coronary artery disease)తో బాధపడుతున్న 64 ఏళ్ల వయస్సున్న 26 మందిని పరిశోధకులు స్టడీ చేశారు. వీరందరినీ రెండు గ్రూపులుగా విభజించి మూడు నెలలపాటు లాఫింగ్ థెరపీ(Laughing therapy) అందించారు.
ఇందులో ఒక గ్రూపులోని వారిని.. వారానికి రెండు సార్లు గంటసేపు కామెడీ యాక్టివిటీస్(Comedy Activities)ను చూసేలా చేశారు. అలాగే మరొక గ్రూప్ వారికి .. ప్రస్తుతం జరుగుతున్న వార్తా విశేషాలు, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ వంటి సబ్జెక్ట్‌తో కూడిన డాక్యుమెంటరీలను మాత్రమే చూపించారు. అలా 12 వారాలు గడిచాక డాక్యుమెంటరీలు, వార్తలతో నాలెడ్జ్ పెంచుకున్న గ్రూప్ కంటే కూడా, కామెడీ యాక్టివిటీస్‌లో పాల్గొన్న గ్రూప్ వారిలో చాలా మార్పులు గమనించారు.
కామెడీ యాక్టివిటీస్(Comedy Activities)లో పాల్గొన్నవారిలో గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడినట్లు పరిశోధకులు గుర్తించారు. పైగా వీరందరిలో కార్డియో వాస్క్యులర్ వ్యవస్థ(Cardio vascular system) ఫంక్షనల్ యాక్టివిటీస్ కూడా 10 శాతం పెరిగాయని..దీంతో గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం నుంచి వారంతా బయటపడ్డారని పరిశోధకులు నిర్ధారించారు.