Significance of Thanks in Human Life: కృతజ్ఞతలు చెప్పేద్దాం.. జీవితంలో ఆనందంగా ఉండేద్దాం
Significance of Thanks in Human Life: మన నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో థ్యాంక్స్ అనే పదాన్ని వింటాం. థ్యాంక్స్ అనే మాటను వాడుతుంటాం. ప్రతిరోజూ మనం తప్పకుండా కొంత మందికి కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుంది. అందులో మొదటిది పుడమి. పుట్టినప్పటి నుండి మనల్ని భరిస్తున్నది కాబట్టి తప్పకుండా పుడమికి థ్యాంక్స్ చెప్పాలి. అదేవిధంగా, మనకు అవసరాలకు ఉపయోగపడే అందరికి కూడా థ్యాంక్స్ చెప్పి తీరాలి. కృతజ్ఞతలు చెప్పడం అంటే రుణపడి ఉంటామని అర్థం కాదు. ఇలా చెప్పడం వలన అవతలి వారికి మనపై తెలియని గౌరవం పెరుగుతుంది. ఎదుటి వ్యక్తులను మనం ఎంతగా గౌరవిస్తామో, వారు కూడా మనకు అంతగా గౌరవం ఇస్తారు.
ఎవరు ఎలాంటి సహాయం చేసినా చిరునవ్వు నవ్వుతూ ఒక చిన్న థ్యాంక్స్ చెబితే చాలు ఉప్పొంగి పోతారు. ఇక, అన్నింటికంటే ముఖ్యంగా ఇంటర్వూకి వెళ్లిన సమయంతో థ్యాంక్స్ అనే పధాన్ని తప్పని సరిగా వినియోగించాలి. ఇంటర్యూ చేస్తున్న వారికి గౌరవిస్తూ వారిని విష్ చేయాలి. ఆ తరువాత, ముగింపు సమయంలో కృతజ్ఞతలు తెలిజేయాలి. ఓపికగా తనను అంతసేపు భరించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం వలన అవతలి వారికి మనపై రెస్పెక్ట్ పెరుగుతుంది. థ్యాంక్స్ అనే పదం వినియోగించవలసినపుడు తప్పనిసరిగా వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, అన్ని సందర్భాల్లో కాకుండా సందర్భోచితంగా ఈ పదాన్ని వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. పర్సనల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో థ్యాంక్స్ అనే పదాన్ని కూడా ప్రామాణికంగా వినియోగిస్తారు.