Holi Festival: హోలీ తరువాత ఈ వేడుక ఎందుకు చేస్తారో తెలుసా?
Holi Festival: దేశంలో పెద్ద ఎత్తున జరుపుకునే పండుగల్లో హోలీ కూడా ఒకటి. హోలీ వేడుకలను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. యువత పెద్ద ఎత్తున ఒకచోట చేరి రంగులను, గులాములను చల్లుకుంటూ వేడుకలు చేసుకుంటారు. కొన్ని చోట్ల కోడిగుడ్లు, టమోటాలతో కలిపి హోలీని చేసుకుంటారు. తెల్లవారు జామునుండే హోలీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. జాతి, కుల, మత బేధం లేకుండా ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు. అయితే, వేడుకలు పూర్తయ్యాక ప్రాంతాలను అనుసరించి ధావత్‌లను చేసుకుంటారు. ఈ ధావత్‌లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి.
ఇందులో ఈ ధావత్‌లో భాగంగా తీసుకునే వాటిల్లో తండే అనే ఆహారం ఒకటి. తండై ఆహారంలో యాలుకలు, బాదం, మిరియాలు, గసగసాలు, సొంపు వంటివి ఉంటాయి. ఎండాకాలం ప్రారంభంలో హోలీ వేడుకలను నిర్వహించుకుంటున్నాము కాబట్టి, వడదెబ్బ, జ్వరాలు వంటివి రాకుండా ఉండేందుకు, శరీరాన్ని చల్లబరిచేందుకు ఈ తండై ఉపయోగపడుతుంది. తెలుగురాష్ట్రాల్లోనిక కొన్ని ప్రాంతాల్లో హోలీ ఆడిన తరువాత ధావత్ పేరుతో మద్యం, లేదా కల్లును సేవిస్తుంటారు. హోలీని ఎక్కువ సమయం ఎండలో ఆడటం వలన శరీరం డీ హైడ్రేషన్ అవుతుంది. దీని నుండి ఉపశమనం పొందేందుకు అనేక ప్రాంతాల్లో ధావత్ పేరుతో మద్యం లేదా కల్లును సేవిస్తుంటారు.