క్యాలరీలు ఎక్కువగా ఉండే కెఫిన్(caffeine) రక్తంలోకి చేరడంతో..రక్తంలో కెఫిన్ లెవల్స్ బాడీ ఫ్యాట్స్‌తో పాటు డయాబెటిస్‌పై ప్రభావం చూపిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది.
Caffeine : చాలామంది పొద్దున లేవగానే కాఫీ, టీ తోనే రోజును ప్రారంభిస్తారు. మధ్యమధ్యలో చాక్లెట్లు, ఎనర్జీ డ్రింకులు, చాక్లెట్లు ఫ్లేవర్డ్ ఫుడ్స్ ఇలా ఎక్కువగా కెఫిన్ ఉన్న ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. అయితే క్యాలరీలు ఎక్కువగా ఉండే కెఫిన్(caffeine) రక్తంలోకి చేరడంతో..రక్తంలో కెఫిన్ లెవల్స్ బాడీ ఫ్యాట్స్‌తో పాటు డయాబెటిస్‌పై ప్రభావం చూపిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. అయితే క్యాలరీలు లేని కెఫిన్ పానీయాలు(Caffeinated drinks) మాత్రం శరీరంలోని ఫ్యాట్ లెవల్స్ తగ్గించడంలో సహాయ పడతాయని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్(Karolinska Institute in Sweden), యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ(University of Bristol in UK), లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్(Imperial College in London) పరిశోధకులు రక్తంలో కెఫిన్ లెవల్స్ గురించి .. ఇప్పటికే జెనెటిక్ డేటాబేస్(Genetic database)ల నుంచి సేకరించిన వెయ్యి మందికి పైగా వ్యక్తుల డేటాను క్షుణ్టంగా పరిశీలించారు.
కెఫిన్(caffeine) విచ్ఛిన్నమయ్యే వేగంతో సంబంధం కలిగి ఉన్న రకరకాల జన్యువులలో గల తేడాలపై ఫోకస్ చేశారు. అయితే వారంతా బ్లడ్‌లో నిక్షిప్తమై ఉండే కెఫిన్ లెవల్స్(caffeine levels) ఒక వ్యక్తి బాడీలోని ఫ్యాట్ పరిమాణంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఇది టైప్ 2 డయాబెటిస్‌తో పాటు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్‌ను డెవలప్ చేసే రిస్క్‌ను బాగా పెంచుతున్నట్లు గమనించారు.