Ratan Tata: రతన్ టాటా ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ..కొన్ని ఆసక్తికర విషయాలు
Ratan Tata follows only one Instagram account
భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా తన జీవితానికి సంబందించిన కొన్ని విషయాలను అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. చాలా అరుదుగా పోస్టులు పెడుతుంటారు. 85 ఏళ్ల వయసులోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టులు చేస్తున్నారు. అయినప్పటికీ రతన్ టాటాను ఏకంగా 85 లక్షల మంది ఫాలో అవుతున్నారు. టాటా చేసే అరుదైన పోస్టులను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
చిన్ననాటి ఫోటోలతో పాటు, వయసులో ఉన్నప్పుడు తాను పనిచేసే ప్రదేశంలో తీయించుకున్న ఫోటోలను రతన్ టాటా పోస్టు చేస్తున్నారు. వీటిని చూసేందుకు లక్షలాది మంది ఆసక్తిని చూపిస్తున్నారు.చివరి సారిగా జనవరి 15న రతన్ టాటా ఇన్ స్టాలో ఓ పోస్టు చేశారు. టాటా ఇండికా కారు మార్కెట్లోకి ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పోస్టు చేశారు.
రతన్ టాటాను 85 లక్షల మంది ఫాలో అవుతున్నప్పటికీ, ఆయన మాత్రం కేవలం ఒక్క అకౌంట్ నే ఫాలో అవుతున్నారు. అది కూడా ఇతరులకు చెందిన కాదు. టాటా గ్రూప్ తరపున సేవా కార్యక్రమాలను చేసే టాటా ట్రస్ట్ అకౌంట్ ను రతన్ టాటా ఫాలో అవుతున్నారు.
టాటా ట్రస్టు 1919లో ఏర్పాటు అయింది. అప్పటి నుంచి నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి సాయం అందించారు. టాటా ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు రతన్ టాటా తెలుసుకుంటారు. అందుకే ఆ అకౌంట్ మాత్రమే ఫాలో అవుతున్నారు.