QR Code Scanner: పండగ సమయాన స్మార్ట్ గంగిరెద్దు..తలపై క్యూ .ఆర్ కోడ్
QR Code Scanner on Gangireddu
ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ చెల్లింపుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అన్నివర్గాల ప్రజలు ఆన్ లైన్ చెల్లింపులకు అలవాటు పడుతున్నారు. టీ స్టాళ్ల దగ్గర నుంచి కూరగాయలు అమ్మేవాళ్ల వరకు అందరూ క్యూ ఆర్ కోడ్లను తమ వద్ద ఉంచుకుంటున్నారు. తద్వారా కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు.
పండగ సందర్భంగా తాజాగా ఓ చోట దర్శనమిచ్చిన క్యూ ఆర్ కోడ్ చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. పండుగ సందర్భంగా గంగిరెద్దులతో ఇళ్ల ముందు ప్రత్యక్షమయ్యే ఓ వ్యక్తి గంగిరె్ద్దు కళ్ల కిందన క్యూ ఆర్ కోడ్ ను ఉంచాడు. ఆన్ లైన్ ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్నాడు. తాను కూడా టెక్నాలజీకి అలవాటు పడ్డాడు. గంగిరెద్దుపై క్యూ ఆర్ కోడ్ స్కానర్ ఉండడాన్ని గమనించిన ఆశిష్ అనే వ్యక్తి ఫోటో తీసి ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. ఆ ఫోటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
Smart Gangireddu !
Happy #Bhogi and #MakaraSankranti. #DigitalIndia pic.twitter.com/VUjSIiN1Rq
— Ashish (@KP_Aashish) January 14, 2023