Professional Cuddler : హగ్ కంఫర్ట్ థెరపీ… కౌగిలింతకు రూ. 7,000
‘Professional Cuddler’ Charges Rs 7,000 An Hour For A Hug : కౌగిలింత అనేది మౌనంగా మనసును మాట్లాడే ప్రక్రియ. కౌగిలింత ప్రేమ, సంరక్షణ, ఆనందం, ఆందోళన ఈ భావాలన్నింటినీ వ్యక్తపరుస్తుంది. కౌగిలింత మీరు మీ భాగస్వామికి వ్యక్తం చేస్తున్న భావాలను తెలియజేస్తుంది. దీనిపై పరిశోధనలు కూడా జరిగాయి. కాబట్టి ఈ విషయాలన్నీ శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. హ్యాండ్‌షేక్ లేదా కౌగిలింత వంటి స్పర్శ ద్వారా ఒత్తిడి, టెన్షన్‌ను తగ్గించవచ్చు. కౌగిలి అవతలి వ్యక్తిని ప్రోత్సహిస్తుంది, వారికి నమ్మకాన్ని పెంచుతుంది. సాధారణంగా అందరూ ఒకరినొకరు ప్రేమగా కౌగిలించుకుంటారు. అయితే డబ్బులు ఇచ్చి కౌగిలించుకోవడం గురించి తెలుసా?
తెలియని వ్యక్తిని కౌగిలించుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది? అవును మీరు విన్నది నిజమే… ఓ వ్యక్తి ప్రొఫెషనల్ గా హగ్ తోనే సంపాదించుకుంటున్నారు. గంట పాటు కౌగిలించుకుని, ఒత్తిడిని తగ్గిస్తున్నాడు సదరు వ్యక్తి. అయితే ఆ గంట కౌగిలి రూ. 7,000 వసూలు చేస్తాడు. కౌగిలించుకోవడం ద్వారా, మీ భావాలు మీ భాగస్వామి మనసును తాకుతాయి. మాటల్లో చెప్పలేని ఎన్నో ఆలోచనలను టచ్ తెలియజేస్తుంది. ప్రేమ, సంరక్షణ, ఆనందం, ఆందోళన ఈ భావాలన్నింటినీ వ్యక్తీకరించడానికి కౌగిలింత మంచి మార్గం. ఇది మీ భావాలను నేరుగా మీ భాగస్వామి హృదయానికి తెలియజేస్తుంది. హగ్గింగ్ అంటే శృంగారం కాదు… బదులుగా రెండు హృదయాలు పరస్పరం మాట్లాడుకునే ప్రత్యేక సమయం.
UKలోని బ్రిస్టల్‌లో ఉన్న ట్రెజర్, ప్రజలు సురక్షితంగా, ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడేలా గంటసేపు కౌగిలించుకోవడానికి రూ. 7,000 వసూలు చేస్తున్నాడు. అవసరమైన స్పర్శ ద్వారా వ్యక్తికి శ్రద్ధ, ఆప్యాయత, సద్భావన కలిగిస్తున్నది. కెనడాలోని మాంట్రియల్‌కు చెందిన ట్రెజర్ తమ వ్యాపారం ఏంటో అందరికీ అర్థం కాదని, కొంతమంది దీన్ని సెక్స్ వర్క్‌గా తప్పుబడుతున్నారని అన్నారు. “మానవ సంబంధాలను మెరుగు పరచడానికి నా అభిరుచి మేరకు నేను వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. చాలా మంది ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు. కడిల్ థెరపి, హగ్ కంఫర్ట్ థెరపీతో ఆ ఒత్తిడి తగ్గి, ప్రశాంతత లభిస్తుంది. కొంతమందికి మొదట్లో కొంచెం వింతగా అనిపిస్తుందని, అయితే ఇది పూర్తిగా సాధారణమని, వారు ఈ థెరపీ తరువాత ప్రశాంతంగా ఉంటారని, వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రశాంతతను చేకూర్చే హగ్ ఇస్తామని ట్రెజర్ తెలిపారు.