ప్రీ వెడ్డింగ్ షూటే కాదు డైటు కూడా!
ఒకప్పుడు పెళ్లి చూపులకు వెళ్లి ఒకరినొకరు నచ్చితే.. పెళ్లి తంతు కానిచ్చేవారు కానీ ఇప్పుడు అలా కాదు. కట్నకానుకలు తగ్గినా పర్లేదు, విద్యార్హతలు సరితూగకున్నా పర్వాలేదు కానీ ఫిట్‌నెస్ విషయంలో మాత్రం ఇద్దరూ సరితూగాల్సిందే అంటున్నారట వధూవరులు. ప్రస్తుతం నగరంలో ప్రీ వెడ్డింగ్ డైట్ కల్చర్ పెరిగిందని మ్యారేజ్ బ్యూరోలు నడిపేవారు చెబుతున్నారు. పెండ్లి కుదిరిన ఆరు నెలల ముందు నుంచే పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు వ్యాయామం నుంచి పోషకాహారం వరకు ప్రతి చిన్న విషయంలో నిపుణుల సూచనలు పాటిస్తున్నారు. అందంగా.. ఆరోగ్యంగా కనిపించడం కోసం పలు రకాల వ్యాయామాలపై దృష్టిపెడుతున్నారని, దాని కోసం నచ్చిన ఫుడ్‌ను సైతం పక్కనపెడుతున్నారు. కేలరీలు కౌంట్ చేసుకుని మరీ కొలెస్ట్రాల్‌ను జిమ్‌లలో కరిగించుకుంటున్నారని తేలింది. ఒకప్పుడు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్లు ఎలా చేసేవారో ఇప్పుడు అలానే ప్రీ వెడ్డింగ్ డైట్ చేస్తున్నారట.