కాలుష్యం వల్ల ఎండుగజ్జి వంటి చర్మసమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Pollution : వాహనాల నుంచి వచ్చే పొగ (Fog), సిగరెట్లు (Cigarette) కాల్చడం వల్ల విడుదలయ్యే రసాయనాలు, చెత్త కాల్చడం వల్ల వచ్చే పొగ… అన్నీ కలిసి గాలి కాలుష్యానికి (Pollution) కారణం అవుతున్నాయి. ఆ గాలి కాలుష్యం చర్మం (Skin)పై చాలా ప్రభావం చూపిస్తోంది. తాజా అధ్యయనం ప్రకారం కాలుష్యం వల్ల ఎగ్జిమా అంటే ఎండుగజ్జి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాలుష్యంలోని దుమ్మూధూళి, రసాయనాలు చర్మంపై చేరి ఎండుగజ్జి వస్తుంది. వాతావరణంలో ఉండే కాలుష్య కారకాలు చర్మ అలెర్జీలకు కారణం అవుతుంది. అలెర్జీలో భాగంగా దురద, ఎరుపుదనం, చీము కారడం వంటి సమస్యలు వస్తాయి.
1970ల కాలంనాటితో పోలిస్తే ఇప్పుడు ఎగ్జిమా కేసులు ఎక్కువైపోయాయి. దీనికి కారణం పెరిగిన కాలుష్యమే. ఎగ్జిమాను అలాపిక్ డెర్మాటిటిస్ అని పిలుస్తారు. గజ్జి అని తెలుగులో అంటారు. ఎక్కువగా ఇది చిన్నపిల్లల్లో వస్తుంది. కొంతమంది తామరగా దీన్ని భావిస్తారు. `ముఖం, చేతులు, కాళ్లు, పాదాల మీద ఎక్కువగా ఇది వస్తుంది. పెద్దవాళ్లలో ఇది మోచేతులు, మోకాళ్ల మీద వస్తుంది. కాలుష్యం వల్లే కాదు, శరీరంలో విటమిన్ బి6 లోపించడం వల్ల కూడా ఈ ఎగ్జిమా వచ్చే అవకాశం ఉంది.
ఎగ్జిమా సమస్యతో బాధపడేవారు స్నానం చేసే నీటిలో కొబ్బరినూనె, జోజోబా నూనెను వేసి స్నానం చేయాలి. ఆ నీరు గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. గ్లిజరిన్ వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎగ్జిమా వచ్చిన చోట గ్లిజరిన్ను నీటిలో కలిపి పూస్తే మంచిది. అలా పూశాక అయిదు నిమిషాల తరువాత స్నానం చేయాలి.
పిల్లల్లో ఎగ్జిమా వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పిల్లల చర్మాన్ని తేమవంతంగా ఉంచాలి. మాయిశ్చరైజింగ్ చేసే సబ్బును వాడాలి. వదులు దుస్తులు పిల్లలకు వేయాలి. పిల్లల్లో గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. చిన్నారుల చర్మం తేమవంతంగా ఉండేలా చూసుకోవాలి.