Office relationship leads depression: ఆఫీస్ ఒత్తిడికి బ్రేకప్ చెప్పకుంటే
Office relationship leads depression: ఉద్యోగులు సాధారణంగా ఇంట్లో కంటే ఆఫీసులోనే ఎక్కువగా ఉంటున్నారు. ఆఫీసులో ఉద్యోగులు తమ సహచరులతో ఎక్కువ సమయం గడుపుతుంటారు. సహచరులతో తమ భావాలను పంచుకుంటారు. అదే సమయంలో వారి మధ్య కొన్ని రకాల రిలేషన్‌షిప్స్ ఏర్పడతాయి. ఈ రిలేషన్‌షిప్స్ ఒక్కోమారు శృంగారం వైపుకు కూడా దారి తీస్తాయి. ఇలాంటి రిలేషన్‌షిప్స్ ఒక్కోమారు శృతిమించితే దాని పర్యావసానం వృత్తిపరమైన జీవితంపై పడుతుంది. ఇలాంటి విషయాలు బయటకు వచ్చి నలుగురికి తెలిస్తే దాని ఫలితం ఉద్యోగం కోల్పోవడం లేదా, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొనడం వంటివి జరుగుతుంటాయి. పరిస్థితులను బట్టి భావొద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకున్నప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది.
అలా కాకుండా మానసికంగా సంఘర్షణలకు లోనైతే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్యాలయాల్లో కొలీగ్స్ మధ్య వర్క్‌లో భాగంగా చర్చలు జరుగుతుంటాయి. ఈ చర్చల సమయంలోనే వారి మధ్య తెలియని ఒక రిలేషన్‌షిప్ డెవలప్ అవుతుంది. ఈ రిలేషన్ షిప్ క్రమేణా పర్సనల్ రిలేషన్‌షిప్ వైపుకు దారితీస్తుంది. ఇలాంటి రిలేషన్ ఉన్న వ్యక్తులు ఒకరినొకరు సహాయం చేసుకుంటే రిలేషన్‌షిప్ లాంగ్‌టైమ్ కొనసాగుతుంది. ఆఫీసులోని ఒత్తడి నుండి బయటపడేందుకు ఈ సంబంధాలు దొహదపడతాయి. ఇకవేళ మీరు సంబంధాలు పెట్టుకున్న పార్ట్నర్ నుండి మీకు బ్రేకప్ అయితే, వారికి దూరంగా ఉండేందుకు సదా వ్యవహరించడం మంచిది. బ్రేకప్ తరువాత అనవసర ఆలోచనలు, రిలేషన్ షిప్ గురించే ఆలోచిస్తూ కుంగిపోవద్దు.