National Youth Day: వివేకానంద భోదనలే అందరికి స్ఫూర్తిదాయకం
National Youth Day: భారతదేశంలోని గొప్ప ఆధ్యాత్మిక వేత్తలలో స్వామి వివేకానంద ఒకరు. ఆయన తన రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రాచీన భారత సంస్కృతిని ప్రపంచానికి తెలియజేశారు. స్వామి వివేకానంద ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు, కషాయాన్ని ధరించి కాలినడకనే ఎంతోమందిలో దేశభక్తికిని చాటిచెప్పిన గొప్ప మహానుభావుడూడాయన.. భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటి చెప్పిన సిసలైన దేశ భక్తుడు స్వామి వివేకానంద. భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని తపించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. ప్రతీ ఒక్కరు చదువుకోవాలని కృష్టి చేసిన ఒక ఆదర్శమూర్తి.. దేశం నాకేమి ఇచ్చిందనికాదు..దేశానికి నువ్వేమిచ్చావ్ అన్న నానుడిని ప్రతో ఒక్కరి మనసుల్లో ఉండిపోయేలా చేసారు స్వామి వివేకానంద. జనవరి 12న వివేకానందుడు జన్మించారు. ఈ రోజున భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.
ఆధ్యాత్మిక వేత్తలలో స్వామి వివేకానంద ఒకరు. ఆయన తన రచనల ద్వారా ఎంతోమందిలి తట్టిలేపారు. ఉపన్యాసాల ద్వారా ప్రాచీన భారత సంస్కృతిని ప్రపంచానికి తెలియజేశారు. యువతలో చైతన్యం నింపడానికి, వారిని దేశాభివృద్ధిలో భాగం చేయడానికి ఆయన చేసిన కృషిని ఎవరు మరచిపోలేరు. భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని 1983లో ప్రపంచ సర్వమత సార్వత్రిక సమ్మేళనంలో దేశ ఆధ్యాత్మిక విలువలను చాటిచెప్పారు. చికాగో జరిగిన సదస్సులో వివేకానంద హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించారు. అతను మొదట పలికిన పలుకులు ‘అమెరికా సోదరులు, సోదరీమణులు’. ఈ పలకరింపులో ప్రజల పట్ల ఆయనకున్న సోదర భావం దాగి ఉంది. అంతకుముందు ప్రసంగించిన వారందరు.మై డియర్ ఫ్రెండ్స్ అంటే మన వివేకానందుడు మాత్రం సోదర భావం తో ప్రసంగం మొదలుపెట్టగానే అక్కడున్న చికాగో ప్రజల్లో ఎక్కడలేని ఉత్సహం నెలకొంది.
అప్పట్లో ఒక నానుడి ఉండేది.. ప్రపంచ సర్వమత సార్వత్రిక సమ్మేళనంలో పాల్గొన వివిధ దేశాల ప్రతినిధులు వారి వారి దేశాల పవిత్రమైన గ్రంధాలను తీసుకొచ్చారట. అయితే అక్కడకు వివేకానందుడు భారతదేశం పవిత్ర గ్రంధం అయినా భగవద్గీత ను తీసుకెళ్లాడు. వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు ఇండియన్స్ అంటే నల్లవాళ్ళని ఒక చులకనభావం ఉండేది. అక్కడ అందరు ప్రసంగిస్తున్న సమావేశంలో వారి వారి గ్రంధాలను ఒక్కొక్కటిగా ఒకదానిమీద ఒకటి పెట్టారు. మన భగవద్గీత ను కూడా అక్కడే పెడితే కొందరు మన గ్రంధాన్ని చివరగా పెట్టారు. దాన్ని గమనించిన వివేకానంద ప్రసంగిస్తూ నా గ్రంధాన్ని ఇవ్వమని అక్కడున్న వారిని కోరారు. అప్పుడు అక్కడున్నవారు భగవద్గీత గ్రంధాన్ని తీయగానే పైన ఉన్న గ్రంధాలన్నీ ఒక్కసారిగా కిందపడిపోయాయి.. ఇదంతా చుసిన అక్కడున్న ప్రతినిధులు ఒక్కసారిగా తాము చేసిన పనికి తలలు దించుకున్నారు. దీనికి సమాధానంగా వివేకానందుడు ఇది కావాలని కానీ చేసిన పని కాదు. అన్నిమతాల గ్రంధాలను గౌరవంగా చూడాలని అందుకే ఈ పని చేసానని చెప్పి మళ్ళీ అక్కడే అందరికి క్షమాపణలు చెప్పగానే అక్కడున్న వారంతా ఒక్కసారిగా చప్పట్లతో సభ ప్రాంగణమంతా మార్మోగించారనే నానుడి ప్రచారంలో ఉంది. స్వామి వివేకానంద చెప్పిన మాటలు, ఆయన సూక్తులు నేటికి ఎంతో మందికి స్ఫూర్థినిస్తాయి, లక్ష్యం దిశగా అడుగులు వేసేందుకు ప్రేరణ కలిగిస్తాయి, జీవితంలో ఎలాంటి కష్టాన్నయినా ఎదురించగల ధైర్యాన్నిస్తాయి.
తన గురువు రామకృష్ణ పరమహంస ఎక్కడా సొంత మతాన్ని ప్రకటించలేదు. అదే సిద్దాంతాన్ని వివేకానందుడు అనుసరించాడు. తన బోధలతోనే యువతలో చైతన్యాన్ని నింపాడు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతావు. అనవసరంగా మాట్లాడితే అర్ధాన్ని కోల్పోతావు. అని చాటిచెప్పాడు. భయాలను ఎదుర్కోవడం ప్రపంచంలోనే గొప్ప మార్పును కలిగిస్తుంది అంటూ స్వామి వివేకానంద తెలిపారు. లేవండి, మేల్కొండి, లక్ష్యం చేరే వరకు విశ్రమించకండి’ జీవిత ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని అధిగమించడానికి పట్టుదల అవసరం. ఏదైనా పనిని పట్టుదలతో ప్రారంభిస్తే.. వైఫల్యం ఎదురయ్యే అవకాశం లేదు. అంతిమంగా విజయం సొంతం అవుతుంది. ప్రయత్నించకుండా ఓడిపోకు ప్రయత్నం చేసి ఓడిపో అప్పుడే గెలుపంటే ఏంటో తెలుస్తుందని యువత కి చాటి చెప్పాడు. మీపై మీకు నమ్మకం ఉన్నంత వరకు మీ లక్ష్యాలను సాధించకుండా ఏదీ మిమ్మల్ని ఆపదంటూ నినదించాడు. ఆయన ఆచరణలు అందరు పాటిస్తే ఏ వ్యక్తి అయినా అత్యున్నత స్థానంలో కొనసాగుతాడు.