Multiple Husbands : ఆ మహిళలందరికీ నలుగురు, ఐదుగురు భర్తలు!
Multiple Husbands : మనదేశంలో ఒక స్త్రీకి ఒక్కరే భర్త ఉండాలి, అలాగే ఒక పురుషుడికి ఒక్కరే భార్య ఉండాలి. కానీ మనదేశంలోని ఉత్తరాఖండ్‌లోని జౌన్సార్-బవార్ అనే ప్రాంతంలోని కొన్ని తెగలలో ఒక మహిళ నలుగురైదుగురు వివాహం చేసుకునే సాంప్రదాయం ఉందట. దక్షిణాన నీలగిరులు, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో, డెహ్రాడూన్, టోడా తెగలో కొన్ని జాతులలో ఇప్పటికీ ఈ సాంప్రదాయం కొనసాగుందని అంచనా. అదేమంటే పాండవులు మొదట కొన్ని ఏండ్లపాటు ఈ ప్రాంతంలో నివసించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న సమయంలో ద్రౌపదితో పంచ పాండవుల వివాహం జరిగిందట. అప్పటి నుంచి బహుభర్తల సాంప్రదాయాన్ని ఆ ప్రాంత ప్రజలు స్వీకరించినట్లు చెబుతున్నారు. అదే సంప్రదాయం ఈరోజుల్లో కూడా కొనసాగుతుందట.
కొన్ని తెగలలో బహుభర్తల సాంప్రదాయం కొనసాగడానికి మరో కారణం కూడా ఉందని, అదేమంటే ఆ ప్రాంతాల్లో ఉండే ప్రతిఒక్క కుటుంబం వ్యవసాయ భూమిపైనే ఆధారపడి జీవిస్తుంటారని చెబుతున్నారు. అలా ఒక్కో ఇంట్లో 5 నుంచి ఆరుగురు మగపిల్లలు ఉంటారు. ఆ అన్నదమ్ములంతా వేర్వేరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే ఆస్తి పంపకాలు జరిగి కుటుంబ పోషణ భారంగా మారుతుంది, అదే వారంతా ఒకే అమ్మాయిని వివాహం చేసుకుంటారని అంటున్నారు. మరో ముఖ్యమైన కారణం కొన్ని తెగలలో అమ్మాయిలు తక్కువగా ఉండి, అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సి వస్తుందట. ఈ అన్నదమ్ములందరినీ వివాహం చేసుకున్న మహిళ రోజుకు ఒకరి చొప్పును కాపురం చేస్తుంది, ఆ సమయంలో ఎవరైతే గదిలో ఉంటారో వారి టోపీని తలుపులకి తగిస్తారని చెబుతున్నారు.