Microsoft Employee heart touching note on layoff: మైక్రోసాఫ్ట్‌తో రెండు దశాబ్ధాల ప్రయాణం… అనుభవం నియంత్రణ భావోద్వేగం
Microsoft Employee heart touching note on layoff: ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్భణం పెరుగుదల కారణంగా టెకీ సంస్థలు భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇందులో భాగంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇందులో కొత్తగా జాయిన్ అయినవారి దగ్గరి నుండి ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. ఉద్యోగాలు కొల్పోయిన టెకీలు వారి జీవితానుభవాలను, సంస్థతో ఉన్న అనుబంధాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
21 ఏళ్లపాటు మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసి ఇటీవలే ఉద్యోగాన్ని కోల్పోయిన ప్రశాంత్ కమాని తన అనుభవాలను, మైక్రోసాఫ్ట్ కంపెనీతో తనకున్న అనుబంధాన్ని లింక్డ్ఇన్ ద్వారా పంచుకున్నారు. తన కాలేజీ చదువు ముగిసిన వెంటనే మైక్రోసాఫ్ట్‌లోనే ఉద్యోగం లభించిందని, కంపెనీలో ఉద్యోగం ఎలా ఉంటుందోనని భయపడిన సందర్భాలు ఇప్పటికీ గుర్తున్నాయని, ఎంతో మంది నిపుణులు, నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, సీనియర్లతో కలిసి పనిచేయడం వలన తాను ఎంతగానో తెలుసుకున్నానని, కంపెనీలో బహుముఖ పాత్రను పోషించే అవకాశం లభించినట్లు ఆయన తెలిపారు.
కమాని 2015లో మైక్రోసాఫ్ట్ నుండి బయటకు వచ్చి రెండేళ్లపాటు అమెజాన్‌లో పనిచేశారు. ఆ తరువాత తిరిగి మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేరి అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. తన కుటుంబానికి మైక్రోసాఫ్ట్ సంస్థ ఎంతో సహకరించిందని సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విధి రాతను ఎవరూ మార్చలేరని, ఉద్యోగం కోల్పోవడం యాదృశ్చికమేనని అన్నారు. తన అనుభవానికి తగిన ఉద్యోగం మరలా లభిస్తుందని ఆయన తెలియజేశారు. కమాని లింక్డ్ఇన్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మైక్రోసాఫ్ట్ సంస్థ తన కంపెనీలో పనిచేస్తున్న 5 శాతం మంది ఉద్యోగులను తొలగించింది.