Maya Tata: మాయా టాటా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
Maya Tata is an emerging leader in Tata Group
టాటా అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తు వచ్చే పేరు రతన్ టాటా. టాటా వంశంలో అనేక మంది ఉన్నప్పటికీ వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. సైలెంట్ గా వారి పనులు వారు చేసుకుపోతున్నారు. వారిలో ప్రత్యేకంగా నిలుస్తున్న వ్యక్తి మాయా టాటా. రతన్ టాటా డైరెక్షన్లో ఆమె నాయకత్వ లక్షణాలు అలవరుచుకున్నారు. టాటా డిజిటల్ విభాగంలో ప్రస్తుతం ఆమె కీలక బాధ్యతలు చేపడుతున్నారు.
మాయా టాటాతో పాటు ఆమె తోబుట్టువులు లేహ్, నెవిల్లే కూడా టాటా గ్రూప్ లో బాధ్యతలు తీసుకోడానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. నోయెల్ టాటాకు ఉన్న ముగ్గురు పిల్లల్లో మాయా టాటా చిన్న అమ్మాయి. యూకేలో ఓ బిజినెస్ స్కూల్లో డిగ్రీ పూర్తి చేసుకుంది. మాయా టాటా తల్లి ఆలూ మిస్ట్రీ, సైరస్ మిస్ట్రీ సోదరి కావడం విశేషం. మాయా టాటాకు న్యూ ఏజ్ ఎనలిటిక్స్ అంటే ఎంతో ఆసక్తి. ఆ రంగంలో ఉన్న ఆసక్తి కారణంగానే చిన్న వయసులోనే వ్యాపార రంగంలో అడుగుపెట్టారు.