దక్షిణ భారతదేశంలో అల్పాహారాల్లో ముఖ్యమైనది ఇడ్లీ . ఏ టిఫిన్ సెంటర్కి వెళ్లినా ఇడ్లీ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సగం మంది ఇడ్లీలనే ఆర్డర్ చేస్తారు.
Oats Idly : దక్షిణ భారతదేశంలో అల్పాహారాల్లో (Breakfast) ముఖ్యమైనది ఇడ్లీ (Idly). ఏ టిఫిన్ (Tiffin) సెంటర్కి వెళ్లినా ఇడ్లీ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సగం మంది ఇడ్లీలనే ఆర్డర్ చేస్తారు. ఇది ఆరోగ్యానికి (Health) చేసే మేలు ఎంతో. అందుకే అందరూ ఇడ్లీలను ఇష్టపడతారు. ఇడ్లీలను తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు (Side Effects) రావు కూడా. అనారోగ్యంతో బాధపడే వారికి ఇడ్లీలను తినమని సిఫార్సు చేస్తారు. ఎప్పుడూ ఒకే రకమైన ఇడ్లీలను తింటే బోర్ కొట్టేస్తుంది. ఓసారి ఓట్స్ (Oats), కూరగాయలతో ఇడ్లీలు చేసుకుని తిని చూడండి. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా వీటిని ముందుగా నానబెట్టడంలాంటివి చేయక్కర్లేదు. అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
ఓట్స్ – ఒక కప్పు
ఇడ్లీ రవ్వ – అరకప్పు
క్యారెట్ తరుగు – రెండు స్పూన్లు
పెరుగు – అరకప్పు
అల్లం తరుగు – ఒక స్పూను
పచ్చిమిర్చి తరుగు – రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
క్యాప్సికం తరుగు – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
వంట సోడా – ఒక స్పూను
తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి ఓట్స్ వేసి రెండు నిమిషాలు వేయించండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
2. అదే కళాయిలో ఇడ్లీ రవ్వ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోండి.
3. ఇప్పుడు జార్లో ఓట్స్ వేసి మెత్తగా పొడిలా చేసుకోండి. ఆ పొడిని ఒక గిన్నెలో వేయండి.
4. ఆ గిన్నెలో క్యాప్సికం తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడినంత ఉప్పు, నీళ్లు వేసి బాగా కలపండి.
5. అలాగే వేయించుకున్న రవ్వను కూడా వేసి బాగా కలపండి. చివర్లో వంటసోడా కూడా వేసి ఓ పావుగంట పాటు పక్కన పెట్టండి.
6. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని, కాస్త నెయ్యి రాయండి. ఇడ్లీ ప్లేట్లలో పిండిని వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించండి. పావుగంటలో ఇవి ఉడికిపోతాయి.
7. స్టవ్ ఆఫ్ చేసి ఓ పది నిమిషాలు వదిలేయండి. తర్వాత వాటిని ప్లేట్లలోకి వేసి కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి.
8. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. పైగా ఎంతో ఆరోగ్యం కూడా.