రకరకాల వ్యాయామాలు చేసి, కష్టపడి మరీ స్ట్రిక్టు ఆహార నియమాలు పాటిస్తూ తగ్గినా..కొంతకాలానికి బరువు పెరిగిపోతున్నామని వాపోతున్నారు. చివరకు రోజుకు 700- 1200 కేలరీల మధ్య ఉండేలా తక్కువ కేలరీలు తీసుకునే వారు కూడా కొంతకాలానికి తిరిగి బరువు పెరుగుతున్నట్లు( weight gain) అధ్యయనాలు చెబుతున్నాయి.
Weight gain : ప్రస్తుతం ఎవరిని కదిపినా అధిక బరువు (weight gain)సమస్య గురించే చెబుతున్నారు. ఒకప్పుడు నాజూగ్గా ఉండేవాళ్లూ కూడా హఠాత్తుగా బరువు పెరుగుతూ షాక్ ఇస్తుంటారు. పోనీ నానాతంటాలు పడి బరువు తగ్గినా.. అది కంటెన్యూ అవడం లేదన్నవాళ్లూ లేకపోలేదు. రకరకాల వ్యాయామాలు చేసి, కష్టపడి మరీ స్ట్రిక్టు ఆహార నియమాలు పాటిస్తూ తగ్గినా..కొంతకాలానికి బరువు పెరిగిపోతున్నామని వాపోతున్నారు. చివరకు రోజుకు 700- 1200 కేలరీల మధ్య ఉండేలా తక్కువ కేలరీలు తీసుకునే వారు కూడా కొంతకాలానికి తిరిగి బరువు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతెందుకు బిహేవియరల్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్(Behavioral Weight Management Programs) ఫాలో అయ్యి బరువు తగ్గిన ఏడాదికే.. మళ్లీ వాళ్లు 30 శాతం నుంచి 35 శాతం వరకు బరువు పెరుగుతున్నారు(weight gain).
అయితే వీటికి రకరకాలు కారణాలున్నా తిరిగి బరువు పెరగకూడదనుకుంటే మాత్రం కొన్ని టిప్స్ పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వెయిట్ తగ్గడానికి(Lose weight) అంతకు ముందు ఏ ఏ పనులు చేశామో..అదే లైఫ్ స్టైల్‌ను ఫాలో అవుతూ వ్యాయామాలు చేస్తే దీనికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు. కొంతమంది మానసికంగా ఆందోళన పడుతూ ఆహార నియమాలను పట్టించుకోరు. అందుకే ముందుగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే కాస్త బరువు పెరిగినా బరువు పెరిగామని అతిగా ఆలోచించకుండా టెన్షన్ పడకుండా ఉండాలి. ఈ ఒత్తిడి కూడా బరువును పెంచడానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడు గంటల తరబడి ఒకే ప్రదేశంలో కూర్చోకుండా కాస్త అటు ఇటు నడిచి అప్పుడు పని చేస్తూ ఉండాలి. అలాగే ప్రతి రోజూ శారీరిక శ్రమ కూడా అవసరం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
చాలామంది వరుస సెలవులు వచ్చినా, శుభకార్యాలు వంటివి ఉన్నా బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలన్నీ మరచిపోయి ఓ పట్టు పట్టేస్తుంటారు. కానీ ఫుడ్ విషయంలో ఎప్పుడూ కూడా అతి పనికి రాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అలాగే డిన్నర్ తర్వాత చాలామంది పడుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ అది తప్పు.. కాసేపయినా తప్పకుండా ప్రతీరోజూ వాకింగ్ చేయాలి. వీలైతే మెట్లు ఎక్కడం, దిగడం చేయడం అయినా మంచిది.చాలామంది బరువు తగ్గగానే ఇక రిలాక్సయిపోయి.. ఇక వ్యాయామాలు, శారీరక శ్రమ వంటి వాటికి దూరం అయిపోతారు. ఇలాంటివాళ్లలో ఎక్కువ మంది బరువు పెరిగే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.అందుకే రోజుకు ఆహార నియమాలు పాటిస్తూనే వ్యాయామాలు చేయడం మరచిపోకూడదన్న విషయాన్ని బరువు తగ్గాలనుకునే వాళ్లు, తగ్గిన బరువును అలాగే కాపాడుకునాలని అనుకున్నవాళ్లు గుర్తు పెట్టుకోవాలి.