ఈ ఆధునిక కాలంలో సాంకేతికంగా అభివృద్ధి సాధించిన తరువాత ప్రతి ఒక్కరూ ల్యాప్టాప్లను వినియోగిస్తున్నారు. ల్యాప్టాప్ల వినియోగం పెరిగిన తరువాత ప్రపంచం మరింత చిన్నదైపోయింది. ల్యాప్టాప్లు లేని ఇళ్లు కనిపించదు. అయితే, ఇప్పుడు ఓ విగ్రహం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నది.
Ancient Laptop: ఈ ఆధునిక కాలంలో సాంకేతికంగా అభివృద్ధి సాధించిన తరువాత ప్రతి ఒక్కరూ ల్యాప్టాప్లను వినియోగిస్తున్నారు. ల్యాప్టాప్ల వినియోగం పెరిగిన తరువాత ప్రపంచం మరింత చిన్నదైపోయింది. ల్యాప్టాప్లు లేని ఇళ్లు కనిపించదు. అయితే, ఇప్పుడు ఓ విగ్రహం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నది. ఈ విగ్రహం 100 బీసీ కాలానికి చెందినదగా అంచనా వేస్తున్నారు. ఈ విగ్రహం క్యాలిఫోర్నియాలోని మాలిబులోఉన్న జె పాల్ గెట్టి మ్యూజియంలో గ్రేవ్ నైస్కోస్ ఆఫ్ యాన్ థ్రోన్డ్ విమెన్ విత్ యాన్ అటెండెంట్ పేరుతో ఈ విగ్రహాన్ని పిలుస్తారు. ఈ విగ్రహంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.
సుమారు 37 అంగుళాల ఎత్తుగల ఈ విగ్రహంలో ఓ సేవకుడు, ఒక సింహాసనం, ఓ యువతి ఉంటుంది. సేవకుడు ఓపెన్ చేసిన ఓ పెట్టెను పట్టుకొని నిలబడి ఉంటాడు. యువతి ఆ పెట్టె తెరవైపు తదేకంగా చూస్తుంటుంది. అయితే, ఇది నగలు పెట్టె అని, కాదు కాదు ఇతర వస్తువుల ఉపయోగించే పెట్టె అని రకరకాల వాదనలు వినిపిస్తున్నాకయి. ఇక ఆ పెట్టె బేస్ మట్టం పక్కవైపు రెండు రంధ్రాలు కూడా ఉన్నాయి. వాటిని యూఎస్బీ స్లాట్స్ అని చెబుతున్నారు. అయితే ఫోర్బ్స్ కు చెందిన బయో ఆర్కియాలజిస్ట్ క్రిస్టినా కిల్గ్రోవ్ ఈ విగ్రహంపై క్లారిటీ ఇచ్చారు. రాసుకునేందుకు ఉపయోగపడే మైనపు వస్తువులు కావొచ్చని పేర్కొన్నారు.