Beedi roller from Kerala: కేరళ బీడీ కార్మికుడు..అమెరికాలో జడ్జి అయ్యాడు
Kerala labourer became a Judge in US
అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేయడం అందరివల్ల కాదు. అది కొందరికే సాధ్యం. ఆ కొందరిలో కేరళకు చెందిన సురేంద్రన్ కూడా ఉన్నాడు. దినసరి కూలీగా కొన్నాళ్ల పాటు కేరళలో పనిచేసిన ఆ వ్యక్తి…ప్రస్తుతం అమెరికాలో జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
సురేంద్రన్ పటేల్ కేరళలోని కాసరగడ్‌లో జన్మించాడు. తల్లిదండ్రులు నిరుపేదలు. పిల్లలను చదివించే స్థోమత లేని దీనస్థితిలో ఉండేవారు. దీంతో సురేంద్రన్ పదవ తరగతి పూర్తి కాగానే చదవు ఆపేశాడు. తన సోదరితో కలిసి బీడీలు చుట్టే పనికి వెళ్లేవాడు. ఒక పక్క పనిచేస్తున్నా..చదువుకోవాలనే ఆసక్తి మాత్రం ఏ మాత్రం చావలేదు. దీంతో మరుసటి ఏడాది ఇంటర్‌లో చేరాడు.
సురేంద్రన్ తన చదువుకు కావలసిన డబ్బులు తానే సమకూర్చుకునే వాడు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ఓ హోటల్‌లో పనికి కుదిరాడు. అక్కడ పనిచేస్తునూ లా చదివాడు. 1996లో కేరళలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. పాపులారిటీ సంపాదించాడు. తర్వాతి కాలంలో సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదించే స్థాయికి చేరుకున్నాడు. 2007లో అమెరికా పయనమయ్యాడు. అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. టెక్సాస్ బార్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు.
ఈ ఏడాది తొలి రోజున టెక్సాస్‌లోని ఫోర్డ్ బెండ్ కౌంటీలో ఉన్న 240 జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశాడు. సురేంద్రన్ పటేల్ ప్రస్తుత వయసు 51 సంవత్సరాలు.
51-year-old Surendran K. Patel was sworn in as a judge in the 240th Judicial District Court of the US state of Texas on the very first day of the new year. This is special for India because Patel is of Indian origin and before that he was working as a lawyer in Texas. pic.twitter.com/UWTlGTNj3v
— PraneshVJ (@Praneshvjcbe) January 7, 2023