Japan Old Man: పోలీసులకు చిర్రెత్తించిన వృద్ధుడు, 9 రోజుల్లో 2060 కాల్స్
Japanese Man Arrested for Calling Cops 2,060 Times in 9 Days Only to Abuse & Shout at Them
జపాన్‌లో ఓ వృద్ధుడు పోలీసులకు చిర్రెత్తించాడు. నాన్‌స్టాప్‌గా పోలీస్ స్టేషన్‌కి కాల్ చేస్తునే ఉన్నాడు. 9 రోజుల్లో ఏకంగా 2060 సార్లు ఫోన్ చేసి విసిగించాడు. ఫోన్ చేసిన ప్రతి సందర్భంలోనూ పోలీసులపై అరుస్తూ, వారిని తిట్టేవాడు. దీంతో పోలీసులు ఆ వృద్ధుడి ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. ఈ సంఘటన జపాన్‌లో కవాగచీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆ వరకు నాన్‌స్టాప్‌గా కాల్స్ చేస్తునూ ఉన్నాడు. ప్రతి 6 నిమిషాలకు ఓసారి ఫోన్ చేసి విసిగించినట్లు పోలీసులు వాపోయారు. మొత్తంగా 27 గంటల పాటు ఆ ఓల్డ్ మ్యాన్ పోలీసుల సహనాన్ని పరీక్షించాడు. విసుగెత్తిన పోలీసులు నవంబర్ 28న ఆ వృద్ధుడ్ని అరెస్ట్ చేశారు.
Man is arrested in Japan for calling the police 2,060 times over 9 days https://t.co/LYBtFp3R5p pic.twitter.com/4isUSQFw3j
— Ysabel (@WyrmStone) December 9, 2022