Jamun fruit health benefits : నేరేడు పండ్లు
Jamun fruit health benefits : వర్షాకాలంలో విరివిగా దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రకృతి వరప్రసాదమైన ఈ పండులో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, ఫాస్ఫరస్, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, ఇనుము, ఫ్లేవనాయిడ్లు శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందిస్తాయి. నేరేడు పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగుతుంది. బాగా పెరుగుతుంది. నేరేడు పండ్లలో ఉండే విటమిన్-సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తినడం వల్ల హిమోగ్లోబిన్‌ను పెంచడంలో, రక్తాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. రక్తం ద్వారా ఆక్సిజన్‌ను అవయవాలకు తీసుకెళ్లడంలో హిమోగ్లోబిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఐరన్ లోపం లేదా రక్తహీనత ఉన్నవారు నేరేడు పండ్లు తింటే మంచిది.
ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు టైప్ 2 మధుమేహం సమస్యలను తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. నేరేడు పండ్లలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇక నేరేడు పండ్లలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియకు మంచివి. పొత్తికడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గాలంటే ఈ పండును తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి.
ఇందులో ఉండే ఆస్ట్రింజెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మ సమస్యలను తొలగిస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల చర్మంపై వచ్చే మొటిమలు తగ్గి, చర్మం తాజాగా ఉంటుంది. నేరేడు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. విటమిన్ సి, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ కూడా ఇందులో ఉన్నాయి. అందువల్ల ఈ పండు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. పొటాషియం పుష్కలంగా ఉండే జామూన్ గుండెకు చాలా మేలు చేస్తుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు వంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది.