Insurance for Love: లవ్ ఇన్స్యూరెన్స్… బ్రేకపైతే ఇలా డబ్బు తీసుకోవచ్చు
Insurance for Love: కరోనా తరువాత ఇన్స్యూరెన్స్ తీసుకునేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టే ఇన్స్యూరెన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇన్స్యూరెన్స్ కంపెనీల ఆదాయం ప్రస్తుతం మూడు పువ్వులు, ఆరు కాయల మాదిరిగా మారింది. ఇన్స్యూరెన్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే, చాలానే ఉంటాయి. అందులో ముఖ్యమైనవి హెల్త్ ఇన్స్యూరెన్స్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీడు చాంతాడంత పెద్దవిగా ఉంటాయి. అయితే, ప్రేమకు కూడా ఇన్స్యూరెన్స్ ఉంటుందనే ఎవరికైనా తెలుసా? ప్రేమకు ఇన్స్యూరెన్స్ ఏమిటి అంటే, దానికి ఓ ఇన్స్యూరెన్స్ ఉన్నది. దీనినే హార్ట్ బ్రేక్ ఇన్స్యూరెన్స్ ఫండ్ అని పిలుస్తారు. పయనీర్ ఇన్స్యూరెన్స్ సంస్థ ఇలాంటి ఇన్స్యూరెన్స్‌ను ప్రేమికుల కోసం అందిస్తుంది.
ప్రేమలో ఉన్న ఇద్దరు ఇన్స్యూరెన్స్ ను ప్రీమియంగా తీసుకుంటారు. ప్రీమియం కట్టుకున్న తరువాత ఇద్దరిలో ఎవరైనా సరే బ్రేకప్ చెబితే, రెండో వ్యక్తి హృదయం గాయపడకుండా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు ఈ ఇన్స్యూరెన్స్ ఉపయోగపడుతుంది. అయితే, దీనికి కొన్ని రకాల టర్మ్స్ అండ్ కండీషన్స్ కూడా ఉంటాయని పయనీర్ ఇన్స్యూరెన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఇదేదో బాగుంది కదా. ప్రేమించే సమయంలో ప్రియురాలితో కలిసి ఇన్స్యూరెన్స్ తీసుకొని, ఏదైనా కారణాల వలన బ్రేకపైతే ఎంచక్కా ఇన్స్యూరెన్స్ డబ్బులు పొందవచ్చు.