రేడియేషన్ తగ్గించుకుకోవడానికి ఇయర్ ఫోన్స్ వాడితే మంచిదే కానీ ఎక్కువగా వాడితేనే ఇబ్బందులని.. ఫ్యూచర్లో చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
Earphones : ఇప్పుడు ఎక్కడ చూసినా చేతిలో మొబైల్ ఫోన్‌తోనే(Mobile phone) కనిపిస్తున్నారు. కర్ణుడి కవచకుండలాలుగా చేతికి అంటిపెట్టుకుని మరీ తిరిగేస్తున్నారు. ఏ పని చేస్తున్నా.. పక్కన మొబైల్ లేనిదే పొద్దు గడవదన్న స్టేజ్‌కు వెళ్లిపోయారు. దీనికి తోడు ప్రతి ఒక్కరూ దానికి ఇయర్ ఫోన్స్(Earphones), హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసి పాటలు వినేవాళ్లే ఎక్కువయ్యారు.
కాల్స్ కోసం వాడేవాళ్లు తక్కువ మ్యూజిక్ కోసం వినేవాళ్లు ఎక్కువ అయిపోయారు. రోడ్డుమీద వెళుతున్నా..జర్నీ చేస్తున్నా..చివరకు పని చేస్తున్నా కూడా చెవులకు ఇయర్ ఫోన్స్ ఉండాల్సిందే అంటున్నారు. అయితే రేడియేషన్ తగ్గించుకుకోవడానికి ఇయర్ ఫోన్స్ వాడితే మంచిదే కానీ ఎక్కువగా వాడితేనే ఇబ్బందులని.. ఫ్యూచర్లో చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఈ హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల చిన్నవయసు నుంచే వినికిడి శక్తి తగ్గుతుంది. వీటి నుంచి వచ్చే వైబ్రేషన్ వల్ల వినికిడి కణాలు వాటి సున్నితత్వాన్ని కోల్పోతాయి. అంతేకాదు ఇయర్ ఫోన్స్ ఎక్కువ సమయం పెట్టుకోవడం వల్ల మెదడుపైనా కూడా ప్రభావం(affects the brain) పడుతుంది. దీనికి తోడు వీటి వల్ల అనేక శారీరక సమస్యలు, గుండె జబ్బుల(heart diseases)తో పాటు నిద్రలేమి(insomnia) వంటి సమస్యలు వస్తాయి.
ఒకవేళ కచ్చితంగా వాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. గంట కంటే ఎక్కువ సేపు ఇయర్‌ఫోన్స్ వాడకుండా ఉండేలా చూసుకోండి. ఎప్పుడూ కూడా వాల్యూమ్ ఎక్కువ పెట్టి సాంగ్స్ వినడం చేయొద్దు. ఏది ఏమయినా అతి ఏదయినా అది అనర్ధదాయకమేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు.