Control Fever: జ్వరం కంట్రోల్ కావాలంటే
Control Fever: చలికాలం పోయి ఎండాకాలం రాబోతున్నది. సమ్మర్ ఆరంభంలో చాలా మందికి జ్వరంతో బాధపడుంతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు జ్వరంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. జ్వరంతో ఇబ్బందులు ఎదుర్కొనే చిన్నారులకు పారాసిట్‌మాల్ వంటి మాత్రలు వేసి జ్వరం తగ్గిస్తుంటారు. అయితే, మందులతో కాకుండా సాధారణంగా ఇంట్లో కొన్ని రకాల ఔషద మొక్కలను పెంచుకోవడం ద్వారా కూడా జ్వరం నుండి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం ద్వారా సమ్మర్ లో జ్వరం నుండి పిల్లలను కాపాడుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు.
అదేవిధంగా తులసితో తయారు చేసిన టీని రోజుకు రెండు మూడు సార్లు ఇవ్వడం ద్వారా జ్వరం నుండి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా యాపిల్ సైడర్ వెనిగర్ జ్వరం తగ్గించడంతో దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీంతో పాటు అల్లంతో చేసిన ఆహారం తీసుకోవడం ద్వారా కూడా జ్వరం తగ్గుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వేసవి ప్రారంభం అవుతున్న వేళ పిల్లలు పెద్దలు జాగ్రత్తగా ఉండాలని, తగినంత నీటిని తీసుకోవాలని, బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.