Fasting for Heart Health: ఉపవాసం… గుండె పదిలం
Fasting for Heart Health: ఉపవాసం అంటే అది దైవానికి సంబంధించిన అంశం అని ఉపవాసం చేయాలంటే నియమాలు పాటించాలని అంటుంటారు. ఆ నియమాలకు భయపడి చాలా మంది ఉపవాసం చేయడానికి ఆసక్తి చూపరు. అయితే, ఉపవాసం కేవలం దైవానికి మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చేయవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఊబకాయం పెరిగిపోతున్నది. ఫలితంగా హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. గుండె జబ్బులతో మరణించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గతంలో కంటే ఎక్కువ మంది గుండె జబ్బులతోనే మరణిస్తున్నారు. ముఖ్యంగా కరోనా తరువాత ఈ జబ్బులు ఎక్కువయ్యాయి.
దీని నుండి బయటపడాలి అంటే ఆరోగ్యంపై కొంతమేర శ్రద్ధ తీసుకోవాలి. ప్రతిరోజూ కొద్దిసేపైనా వ్యాయామం లేదా యోగా వంటివి చేయాలి. నెలలో ఒకటి రెండు సార్లు ఉపవాసం చేయడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఉపవాసం చేయడం వలన కడుపు ఖాళీ అవుతుంది. ఇన్సులిన్ హార్మోన్‌కు శరీరం స్పందించే తీరు మెరుగుపడుతుంది. ఉపవాసం చేయడం వలన గుండె ఆరోగయం మెరుగుపడుతుంది. గుండెపోటు, స్ట్రోక్స్ నుండి బయటపడొచ్చు. హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యల నుండి బయటపడొచ్చు. శరీరంలో కొవ్వులు, మాంసకృతులు, ఫైబర్స్ సమతుల్యం అవుతాయి. ఉపవాసం సమయంలో నీటిని అధికంగా తీసుకోవడం వలన గాల్ బ్లాడర్‌తో పాటు, కడుపు శుబ్రంగా క్లీన్ అవుతుంది.