Health benefits of Early Wakeup: ఒత్తిడి పరారవ్వాలంటే…
Health benefits of Early Wakeup: ఈ రోజుల్లో మనం ఎప్పుడు పడుకుంటే అదే రాత్రి, ఎప్పుడు నిద్రలేస్తే అదే పగలు. ఉద్యోగాలు అలాంటివి. విదేశాల టైమింగ్స్‌తో ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు. దీంతో సరిగా నిద్రలేక, తినేందుకు సమయం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులే అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. అయితే, సమయాన్ని అడ్జెస్ట్ చేసుకొంటే ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. తెల్లవారే కంటే ముందుగానే నిద్ర లేవడం వలన వ్యాయామం చేసేందుకు సమయం దొరుకుతుందని డైట్ నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా లేచిన రెండు గంటల సమయంలోనే ఆకలి వేస్తుంది. తద్వారా ఆహారం తీసుకుంటాం. దీంతో మధ్యాహ్నం సమయంలో సరిగ్గా ఒంటిగంట వరకు ఆకలి వేస్తుంది.
మధ్యాహ్నం భోజనం చేసేందుకు సమయం దొరుకుతుంది. సాయంత్రం సమయంలోనూ సరైన సమయానికి ఆహారం తీసుకునేందుకు సమయం దొరుకుతుంది. ఉదయాన్నే నిద్రలేవడం వలన రోజంతా యాక్టీవ్‌గా ఉండొచ్చు. ఉదయం సమయంలో బ్రేక్‌ఫాస్ట్ చేయడం వలన గ్యాస్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడొచ్చు. అంతేకాదు, ఉదయాన్నే నిద్రలేచే వారి బ్రెయిన్ కూడా చాలా షార్ప్ గా ఉంటుంది. ఒత్తిడి నుండి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో ఒత్తిడితో ఇబ్బందులు పడేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఒత్తిడి నుండి బయటపడేందుకు పెద్ద సంఖ్యలో ఖర్చు పెడుతున్నారు.