మనం డైలీ మనం తీసుకునే ఆహారాలు కూడా మనలోని జ్ఞాపకశక్తి(The power of memory)పై ఎఫెక్ట్ చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.అందుకే చదివింది గుర్తు ఉండకపోవడం, వారం రోజుల క్రితం జరిగిన సంఘటనలు కూడా మరిచిపోవడం వంటివి జరుగుతాయట.
Memory Power : మనం డైలీ మనం తీసుకునే ఆహారాలు కూడా మనలోని జ్ఞాపకశక్తి(The power of memory)పై ఎఫెక్ట్ చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.అందుకే చదివింది గుర్తు ఉండకపోవడం, వారం రోజుల క్రితం జరిగిన సంఘటనలు కూడా మరిచిపోవడం వంటివి జరుగుతాయట. ఎందుకంటే మనలోని జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి మనం తినే ఆహారమే తోడ్పడుతుందట.
కొన్నిరకాల ఆహారాలు, జ్యూసులు జ్ఞాపకశక్తిని పెంచడంలో బాగా సహాయపడతాయని యూఎస్‌కు చెందిన మానసిక నిపుణుడు కింబర్లీ విల్సన్ చెబుతున్నారు. ముఖ్యంగా ఎర్ర ద్రాక్షపళ్లు(Red grapes), బ్లూ లేదా పర్పుల్ బెర్రీస్(blue or purple berries) జ్ఞాపకశక్తిని పెంచడంలో చాలా బాగా పని చేస్తాయని అంటున్నారు.వీటిని డైరక్టుగా తినలేని వాళ్లు వీటిని జ్యూసుగా చేసుకుని అయినా తాగొచ్చని చెబుతున్నారు. ఈ జ్యూస్‌ను రోజుకు ఒక గ్లాసు 12 వారాల పాటు తాగుతూ ఉంటే.. చివరకు వృద్ధుల్లో కూడా మెమరీ పవర్ పెరుగుతుందని అంటున్నారు.
కొంతమంది చిన్న పిల్లలపై ఒక స్టడీ నిర్వహించగా.. 240 గ్రాముల ఫ్రెష్ బ్లూ బెర్రీస్‌ను కొంతకాలం ఆహారంగా తీసుకుంటున్న పిల్లలు, వీటికి దూరంగా ఉండే వారి కూడా ఎక్కువ విషయాలను గుర్తు పెట్టుకోవడం.. ఎక్కువ సెంటెన్స్ గుర్తుంచుకోవడం వంటి విషయాల్లో ఫాస్టుగా ఉన్నట్లు తేలింది. అయితే ఈ ఎర్ర ద్రాక్షపళ్లు(Red grapes), బ్లూ, పర్పుల్ బెర్రీస్(blue or purple berries)లో మాత్రమే జ్ఞాపకశక్తిని పెంపొందించే లక్షణాలు ఎందుకు ఉంటున్నాయనే ప్రశ్న చాలామందిలో ఎదురయింది. నిజానికి వీటిలో ముదురు రంగును కలుగజేసే ఆంథోసియానైన్స్ అనే పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉండటమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇవి మెదడుకు వెళ్లే రక్తసరఫరాను మెరుగు పరుస్తాయి.అంతేకాదు ఆంథోసియానైన్స్ పోషకాలను,ఆక్సిజన్‌ను సమర్థవంతంగా అందిస్తూ… నరాలను ఉత్తేజ పర్చి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.