పెళ్లిళ్లు, ఫంక్షన్లు అయినప్పుడు చాలామంది నిలబడే తింటారు. అయితే ఇది ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు కానీ.. రెగ్యులర్గా అయితే మాత్రం అస్సలు మంచిది కాదని.. కూర్చుని మాత్రమే తినాలని నిపుణులు చెబతున్నారు.
Standing meals: హిందూ సాంప్రదాయం ప్రకారం భోజనం(Food) చేసినప్పుడు మటం వేసుకుని కింద కూర్చుని తినాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. దీని వల్ల జీర్ణక్రియ మంచిగా జరిగి.. ఆరోగ్యంగా ఉంటామని అంటారు. అంతేకాదు ఎక్కువ తిండిని కంట్రోల్ చేసే శక్తి కూడా కింద కూర్చుని చేసే భోజనంలో ఉందని అంటారు. ఎందుకంటే తినడానికి కిందకు వంగేటప్పుడు ఎక్కువ తిందామన్నా పొట్ట సహకరించదు.. ఈ రోజుకు ఇక ఫుల్ స్టాప్ పెట్టేసేయ్ అని చెబుతూ ఉంటుంది. దీంతో ఫుడ్ కంట్రోల్ కూడా ఉంటుందంటారు పెద్దలు.
కానీ ఇప్పుడు అంతా డైనింగ్ టేబుల్ రోజులు వచ్చేసాయి. పొట్ట కాస్త ముందుకు వచ్చినా ఫుడ్ దగ్గర నో కాంప్రమైజ్ అంటూ కాస్త అదనంగానే బొజ్జను నింపేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి అలా తినడానికి కూడా టైమ్ ఉండటం లేదు. బఫే మీల్స్ పేరుతో నిలబడే భోజనాలు(standing meals) కానిచేస్తున్నారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇంట్లో తినడానికి టైమ్ లేక..చాలామంది రోడ్డు పక్కన నిలబడే తినేసి ఆఫీసులకు , పనులకు వెళ్లిపోతున్న సీన్లు రోజూ కనిపిస్తూనే ఉంటాయి . ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లు అయినప్పుడు చాలామంది నిలబడే తింటారు. అయితే ఇది ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు కానీ.. రెగ్యులర్గా అయితే మాత్రం అస్సలు మంచిది కాదని.. కూర్చుని మాత్రమే తినాలని నిపుణులు చెబతున్నారు.
రోజూ ఇలాగే నిలబడి తింటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిలబడి తినడం(standing meals) వల్ల పేగులు కుచించుకుపోతాయట. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాక జీర్ణ వ్యవస్థపై ఆ ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు.. నిలబడి తినడం వల్ల జీర్ణాశయంలోకి ఆహారం నేరుగా వెళ్లడం వల్ల.. కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో కొవ్వు కూడా పెరిగిపోతుందట.